కథానాయికగా అందంతో ఆకర్షించే భామలు కొందరు ఉంటారు. తమ అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నాయికలు మరికొందరు ఉంటారు. రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్ నందితా శ్వేతా (Nandita Swetha). ఆ అమ్మాయి అందంగా లేదని కాదు, ఆమె అందం కంటే నటన ఎక్కువ హైలైట్ అయిన సినిమాలు ఎక్కువ. 


డస్కీ బ్యూటీ నందితా శ్వేతాది బెంగళూరు. కన్నడ సినిమాతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ రిజల్ట్స్ పక్కన పెడితే తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాతో నందితా శ్వేతా జర్నీ మొదలైంది. ఆవిడ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారంతా! కానీ, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవ్వాల్సిన సిట్యువేషన్ వచ్చింది. ఆమెకు ఎందుకీ దుస్థితి?


'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో నందిత నటన హిట్టు!
'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో నందితా శ్వేతా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్. అందులో నందితా శ్వేతా నటన కూడా హిట్టు. దెయ్యం ఆవహించిన మహిళగా ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. 'దెయ్యం' అని అరిచి పారిపోయిన తర్వాత సత్యను పోలీసుల చేత స్టేషన్‌కు రప్పించి... అక్కడ డోర్ వేసే సన్నివేశం గానీ, 'ఒక్క దోస వేసి పెట్టనా' అని హీరోని అడిగే సన్నివేశంలో నందిత భలే చేసింది. కళ్లు పెద్దవిగా ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్. అయితే... ఆ తర్వాత తెలుగులో ఆమెకు మళ్లీ అంతటి విజయం దక్కలేదు.


'ఆర్ఎక్స్ 100' మిస్... ఆ ప్లేసులో చేసిన ఫిల్మ్ ఫట్!
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత తెలుగులో నందితా శ్వేతాకు బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఆ అవకాశాల్లో ఆవిడ సెలెక్ట్ చేసుకున్న కథలు, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.


'ఎక్కడికి పోతావు చిన్నవాడా' విడుదలైన రెండేళ్లకు 'శ్రీనివాస కళ్యాణం'తో నందితా శ్వేతా ప్రేక్షకుల ముందుకువచ్చింది. 'దిల్' రాజు నిర్మాణం... 'శతమానం భవతి' తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వం... విడుదలకు ముందు సినిమాపై అంచనాలు ఉన్నాయి. విడుదలయ్యాక ఫ్లాప్ కావడం... అందులో నందితా శ్వేతా సెకండ్ హీరోయిన్ కావడం... కెరీర్ మీద కాస్త ఎఫెక్ట్ చూపించాయి. తెలుగులో స్టార్ హీరోలు, యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. 


'శ్రీనివాస కళ్యాణం' విడుదలకు నెల ముందు 'ఆర్ఎక్స్ 100' విడుదలైంది. అదొక సెన్సేషనల్ హిట్. అందులో హీరోయిన్ క్యారెక్టర్ పాయల్ కంటే ముందు నందితా శ్వేతా దగ్గరకు వెళ్లింది. అయితే, ఆవిడ నో చెప్పింది. 'శ్రీనివాస కళ్యాణం'కు ఓటు వేసింది. కొత్త హీరో, దర్శకుడు కంటే నితిన్, దిల్ రాజు వంటి స్టార్ వాల్యూ ఉన్న సినిమాకు ఏ హీరోయిన్ అయినా ఓటు వేయడం సహజం. కానీ, 'ఆర్ఎక్స్ 100' హిట్ అవ్వడం, 'శ్రీనివాస కళ్యాణం' ఫ్లాప్ అవ్వడంతో నందితా శ్వేతా ఓ విజయం మాత్రమే కాదు... క్రేజ్ కూడా కోల్పోయింది.


సినిమాలు వస్తున్నాయి కానీ విజయాలు తగ్గుతున్నాయ్!
'శ్రీనివాస కళ్యాణం' తర్వాత 'బ్లఫ్ మాస్టర్', 'ప్రేమ కథా చిత్రమ్ 2', 'సెవెన్', 'కల్కి', 'కపటధారి', 'అక్షర', 'హిడింబ', 'మంగళవారం' సినిమాల్లో నందితా శ్వేతా యాక్ట్ చేసింది. ఆమెకు వరుసగా అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ విజయాలే కరువు అవుతున్నాయి.


Also Read: తెలుగు పాటకు తొలి నేషనల్ అవార్డు తెచ్చిన కవి... విప్లవ స్ఫూర్తికి చిరునామా శ్రీశ్రీ జీవితంలో 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!



'బ్లఫ్ మాస్టర్'లో నందిత నటనకు మంచి పేరు వచ్చింది. అయితే, ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రమ్ 2' ఫ్లాప్ అయ్యింది. ఆ హారర్ కామెడీ ఫిల్మ్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి హిట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. 'కల్కి'కి ప్రేక్షకుల ఆదరణ దక్కింది. కానీ, అందులో ఆమె హీరోయిన్ కాదు... కీలక పాత్రధారి మాత్రమే. ఆ తర్వాత సుమంత్ సరసన నటించిన 'కపటధారి' ఫ్లాప్. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'అక్షర' ఆశించిన విజయం ఇవ్వలేదు. కథానాయికగా యాక్ట్ చేసిన 'హిడింబ' కూడా! 'మంగళవారం' హిట్ అయ్యింది. అందులోనూ నందితా శ్వేతా హీరోయిన్ కాదు. కీలకమైన పోలీస్ రోల్ చేసింది.


క్రేజ్ లేనటువంటి హీరోల సరసన హీరోయిన్ రోల్స్ చెయ్యడం రాంగ్ డెసిషన్ అని, దాంతో నందితా శ్వేతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వైపు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యిందని ఇండస్ట్రీ జనాల అంచనా. ఈ మధ్యలో తమిళంలో నందిత యాక్ట్ చేసిన సినిమాలు సైతం భారీ హిట్స్ కాలేదు. 'ఢీ' షోలో జడ్జిగా కనిపించడం వల్ల ప్రేక్షకులు మర్చిపోకుండా జాగ్రత్త పడింది నందిత. ఇప్పుడు ఓటీటీల నుంచి హీరోయిన్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... నందితతో 'ఢీ'లో జడ్జిగా చేసిన ప్రియమణి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'తో ఆవిడ ఓటీటీలో స్టార్ అయ్యింది కదా! ఆ దిశగా నందిత దృష్టి పెడితే... ఆమె నటనకు తగ్గ అవకాశాలు మళ్లీ రావచ్చు. హ్యాపీ బర్త్ డే నందితా శ్వేతా.


Also Read'తండేల్'ను రికార్డ్ రేటుకు కొన్న నెట్‌ఫ్లిక్స్ - చైతూ కెరీర్‌లో హయ్యస్ట్, ఎన్ని కోట్లు అంటే?