Ali Fazal About Mirzapur 3 Mixed Reviews: ‘మీర్జాపూర్’ వెబ్ సీరిస్ ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకొని మూడో సీజన్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా ‘మీర్జాపూర్’ సీజన్ 3.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. అయితే మునుపటి రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్‌కు మిక్స్‌డ్ రివ్యూలు లభించాయి. దీనిపై అలీ ఫజల్ అలియాస్ గుడ్డు భయ్య స్పందించాడు. గత రెండు సీజన్ల రివ్యూల గురించి ప్రస్తావిస్తూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.


అంచనాలు అందుకోలేకపోయింది..


‘మీర్జాపూర్’ అనే సిరీస్.. మొదటి సీజన్ విడుదలయినప్పుడు ఇందులోని పాత్రలు, వారి మ్యానరిజం, వారు చెప్పే డైలాగులు.. అన్నీ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో తరువాతి సీజన్స్‌పై ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. అలా హైప్ పెరిగిన చాలావరకు సిరీస్‌లు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోతాయి. తాజాగా విడుదలయిన ‘మీర్జాపూర్ 3’ విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈ సిరీస్ కోసం అందరూ ఎంత కష్టపడ్డారో, ఆడియన్స్ అంచనాలను అందుకోవడానికి ఏం చేశారో బయటపెట్టాడు అలీ ఫజల్. మిక్స్‌డ్ రివ్యూలను పర్సనల్‌గా తీసుకోనట్టు అనిపించినా కూడా అవి అందరికీ పర్సనల్‌గా తగులుతాయని అన్నాడు.


పాపులర్ వెబ్ సిరీస్..


‘‘మేము ఎవ్వరం ఈ రివ్యూలకు బాధ్యత తీసుకోలేము. అది మా పని కాదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ వెబ్ సిరీస్ కుటుంబంలో మనం కూడా ఒక భాగమయినప్పుడు, ఆ కథలో మనం ఒక భాగమయినప్పుడు అవి మనకు చాలా పర్సనల్‌గా తగులుతాయి. మూడు సీజన్లు పూర్తయిన తర్వాత మేము కేవలం కో యాక్టర్స్ మాత్రమే కాదు.. అంతకు మించి. ఎలాంటి విమర్శలు వచ్చినా మేము కలిసే తీసుకుంటాం. కానీ దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయిపోతాం అని మాత్రం చెప్పను. ఎందుకంటే ఈ సిరీస్‌ను కోట్లమంది చూస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఇది కూడా ఒకటి అన్నది మేము మర్చిపోలేదు. అందుకే వారందరి నుంచి రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. ఇంకా వస్తాయి. ఇదంతా చాలా నేచురల్’’ అని చెప్పుకొచ్చాడు అలీ ఫజల్.


ఎఫెక్ట్ మారుతుంది..


‘‘కూల్‌గా ఉంటూ ఇది మా ఒపీనియన్ అని చెప్పడం చాలా కష్టం. మీర్జాపూర్ సీజన్ 2 విడుదలయినప్పుడు కూడా మాకు చాలా విమర్శలు వచ్చాయి. అసలు మీరేం తీశారు, మీరు సీజన్ 1 కంటే అసలు బెటర్‌గా ఎప్పటికీ తీయలేరు అన్నారు. ఇప్పుడు సీజన్ 3 వచ్చిన తర్వాత సీజన్ 2 అన్నింటికంటే తోపు అంటున్నారు. అది వింటుంటే నవ్వొస్తుంది. ముందు సీజన్ విడుదలయినప్పుడు ప్రేక్షకులపై అది చూపించే ఎఫెక్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మెల్లగా ఆ ఎఫెక్ట్ మారుతూ వస్తుంది. ఆడియన్స్ అనేవారు బీస్ట్‌లా ఆలోచిస్తారు. నేను ఇప్పటికే దీని గురించి చాలా చెప్పేశాను’’ అంటూ మిక్స్‌డ్ రివ్యూల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు అలీ ఫజల్. ‘మీర్జాపూర్ 3’ జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.



Also Read: 'ఆర్‌ఆర్‌ఆర్'కు అవార్డుల పంట, సత్తాచాటిన 'సీతారామం' - ఏఏ విభాగంలో ఎవరెవరికంటే..