Indian 2 Movie OTT Partner and Streaming Details: లోకనాయకుడు కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2(Indian 2 movie). భారీ అంచనాల మధ్య నేడు జూలై 12న థియేటర్లోకి వచ్చింది. సుమారు 27 ఏళ్ల క్రితం కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంతంటి సెన్సేసన్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే రూ. 50 కోట్ల గ్రాస్‌ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాదాసు 27 ఏళ్ల ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఇండియన్‌ 2' చిత్రాన్ని తెరకెక్కించాడు శంకర్.


మూవీ టాక్ ఎలా ఉందంటే..


భారీ హిట్‌కి సీక్వెల్‌ కావడంతో భారతీయుడు 2పై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. మొదటి నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్‌ నెలకొంది. అలా భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన భారతీయుడు 2 సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కమల్‌ హాసన్‌ యాక్టింగ్ నెక్ట్స్‌ లెవల్‌ అంటూ ఆడియన్స్‌ రివ్యూస్‌ ఇస్తున్నారు. కానీ కథ, కథనం అవుట్ డేటెడ్‌గా ఉందంటూ ఓ వర్గం ఆడియన్స్‌ నుంచి నెగిటివ్ టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి భారతీయుడు 2 అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయిందంటున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌తో ఫస్ట్‌ డే ఒపెనింగ్ ఇచ్చింది. మరి థియేట్రికల్‌ రన్‌లో ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి. 


ఇండియన్ 2 ఓటీటీ పార్ట్‌నర్‌, స్ట్రీమింగ్‌ డిటెయిల్స్‌


ఇదిలా ఉంటే ఈరోజే థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఓటీటీ డిటైయిల్స్‌ ఆసక్తిని పెంచుతున్నాయి. 'భారతీయుడు 2' ఓటీటీ రైట్స్‌ ప్రముఖ డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ 2పై ముందు నుంచి మంచి బజ్‌ నెలకొంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు 'ఇడియన్ 2' డిజిటల్‌ రైట్స్‌ని దక్కించుకుందట. ఇక ఈ మూవీ థియేట్రికల్‌ రన్ అనంతరం మూవీ ఓటీటీలో విడుదలకు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఏ సినిమా అయినా విడుదలైన రెండు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ అది మూవీ రిజల్ట్‌, దానికి వచ్చిన టాక్‌పై ఆధారపడి ఉంటుంది.



ఈ మధ్య హిట్‌ సినిమాలు కూడా విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్‌ ప్రీమియర్‌కు వస్తున్నాయి. ఇక ప్లాప్‌ సినిమాలు కొని నెలలు గడిచిన ఓటీటీలోకి రావడం లేదు. ఇక భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్‌ విషయానికి వస్తే.. ఈ సినిమా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు నుంచి సమాచారం. లేదా ఆగస్ట్‌ చివరి వారంలో అయినా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రావచ్చని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌, స్ట్రీమింగ్‌ డిటైయిల్స్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. లైకా ప్రొడక్షన్‌లో రూపొందిన ఈ సినిమా కమల్‌ హాసన్ లీడ్‌ రోల్‌ పోషించగా.. హీరో సిద్దార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, కాజల్‌ అగర్వాల్‌, జై సింహా, ఎస్‌.జె సూర్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో కమల్‌ హాసన్ సెనాపతి పాత్రలో కనిపించారు. పాన్‌ ఇండియాగా తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. 


Also Read: భారతీయుడు 2 రివ్యూ: శంకర్ మార్క్ మిస్ - కమల్, సిద్ధూ సూపర్ - సినిమా ఎలా ఉందంటే?