Ananthika Sanilkumar's 8 Vasantalu OTT Release On Netflix: అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '8 వసంతాలు'. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్లలో రిలీజై నెల రోజులైనా కాక ముందే ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'తను ప్రేమించింది... ఓడిపోయింది... ఎదిగింది' అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా అందుబాటులో ఉండనుంది.
ఈ మూవీలో అనంతికతో పాటు హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, కన్న పసునూరి కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. షేహమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. ఓ లవ్ కపుల్ జీవితంలోని 8 ఏళ్ల ప్రయాణం బ్యాక్ డ్రాప్‌గా దీన్ని తెరకెక్కించారు.
Also Read: మెగాస్టార్ మూవీలో గెస్ట్ రోల్ - వెంకీ మామ నెక్స్ట్ మూవీస్ ఏంటో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
శుద్ధి అయోధ్య (అనంతకి సానిల్ కుమార్) 17 ఏళ్లకే ఓ బుక్ రాసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. రైటర్‌గా మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యం సంపాదిస్తుంది. మార్షల్ ఆర్ట్స్, రైటింగ్, ఫ్రెండ్స్, ప్రయాణాలు ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. ప్రేమ పేరుతో ఆమె వెంటపడతాడు. కొద్ది రోజులకు ఇద్దరి మనసులు కలుస్తాయి. శుద్ధి తన ప్రేమను వరుణ్‌కు చెప్పే టైంకు ఆమె హృదయాన్ని విరిచేస్తాడు.
ఈ బాధ నుంచి కోలుకున్న శుద్ధి మరో పుస్తకం రాస్తుంది. ఆ టైంలోనే రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) ఆమెకు పరిచయం అవుతాడు. అతన్ని ప్రేమించిన శుద్ధి... ఈ విషయం తన తల్లికి చెప్పాలనుకుంటుంది.అయితే, అనుకోకుండా ఫ్యామిలీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత తల్లి సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటుంది. అసలు తల్లికి ఆమె లవ్ విషయం తెలిసిందా? సంజయ్ శుద్ధిని ప్రేమించాడా? విదేశాల నుంచి వరుణ్ వచ్చాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.