Venkatesh Upcoming Movies List Announced: ఈ ఏడాది ప్రారంభంలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇదే జోష్‌తో రాబోయే తన మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అమెరికాలో 'నాట్స్ 2025' ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన తన మూవీస్ గురించి మాట్లాడారు.
మెగాస్టార్ మూవీలో రోల్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీలో వెంకీ గెస్ట్ రోల్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు వెంకీ. తన రోల్ చాలా ఫన్నీగా ఉంటుందని... ఆడియన్స్‌కు నవ్వులు పంచుతుందని చెప్పారు.
ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ అతిథి పాత్రలో నటించనున్నారు.
లైనప్ ప్రాజెక్ట్స్... వైరల్
దీంతో పాటే తన రాబోయే ప్రాజెక్టుల గురించి వెంకీ అప్డేట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. 'ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం. మళ్లీ మేమిద్దరం కలిసి రాబోతున్నాం. అలాగే మీనాతో కలిసి 'దృశ్యం 3' సినిమా చేస్తున్నా. ఈ మూవీస్‌తో పాటే మరో భారీ ప్రాజెక్టులో నా స్నేహితుడితో కలిసి నటిస్తున్నా. తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన ఓ పెద్ద స్టార్.' అని వెంకీ తెలిపారు. ఈ మూవీస్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ మూవీ టైటిల్ అదేనా...
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని హైప్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రానికి 'వెంకటరమణ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఫిలింనగర్ వర్గాల టాక్. ఈ మూవీ కూడా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.
ఇక తర్వాత ప్రాజెక్టులను కూడా లైనప్‌లో పెట్టారు వెంకీ. ప్రస్తుతం 'మెగా 157' మూవీ పూర్తైన తర్వాత అనిల్ రావిపూడితో 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. ఈలోపే 'దృశ్యం 3' కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దృశ్యం, దృశ్యం 2 మూవీస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక మరో స్టార్‌తో భారీ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేయడంతో ఆయన ఎవరా అనే చర్చ మొదలైంది. మరో మల్టీస్టారర్ రానుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.