Upcoming Telugu Movies OTT Releases In July Second Week 2025: ఈ వారం మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కామెడీ మూవీస్‌తో పాటు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయ్. రొమాంటిక్ కామెడీ డ్రామాతో పాటు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ అలరించబోతున్నాయి. మరి ఆ మూవీస్ ఓసారి చూస్తే...
ఆర్కే నాయుడు 'ది 100'
'మొగలిరేకులు' ఫేం సాగర్ ప్రధాన పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మూవీ 'ది 100'. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ మూవీని తెరకెక్కించగా... మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నగర శివార్లలో సామూహిక హత్యలు కలకలం రేపగా... ఈ మర్డర్స్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? అనే థ్రిల్లింగ్ అంశాలతో మూవీని తెరకెక్కించారు.
సుహాస్... 'ఓ భామ అయ్యో రామా'
యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'ఓ భామ అయ్యో రామా'. ఆయన సరసన మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించగా రామ్ గోదల తెరకెక్కించారు. సినిమాలో స్టార్ డైరెక్టర్స్ మారుతి, హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించారు. సుహాస్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపించనున్నారు. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రొమాన్స్... కామెడీ... 'వర్జిన్ బాయ్స్'
గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వర్జిన్ బాయ్స్'. దయానంద్ దర్శకత్వం వహించగా... శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
సూపర్‌గా... 'సూపర్ మ్యాన్'
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అవి సూపర్ హీరోస్ అడ్వెంచర్స్. అలాంటి 'సూపర్ మ్యాన్' మూవీ ఈ నెల 11న ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించగా... డీసీ యూనివర్స్‌లోని సూపర్ మ్యాన్ ఫిల్మ్ సిరీస్‌లకు రీబూట్ వెర్షన్‌గా రానున్న ఫస్ట్ హాలీవుడ్ మూవీ ఇది. డేవిడ్ కొరెన్స్‌వెట్ సూపర్ మ్యాన్‌గా నటించనున్నారు. రెచెల్ బ్రోస్‌నహన్, ఇసబెలా మెర్సిర్, నాథన్ ఫిల్లోన్, ఆంటోని కారిగ్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు.
గ్యాంగ్ స్టర్ 'మాలిక్'
పుల్కిత్ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా 'మాలిక్'. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషి సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అలరించారు.
ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు
- జులై 8 - మూన్ వాక్ (మలయాళం మూవీ - జియో హాట్ స్టార్), కరాటే కిడ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది పొనీషియన్ స్కీమ్ (ప్రైమ్ వీడియో), ది అన్ హౌలీ ట్రినిటీ (అమెజాన్ ప్రైమ్ వీడియో), వాచ్ ది స్కైస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
- జులై 9 - బల్లార్డ్ (ఇంగ్లీష్ సిరీస్ - ప్రైమ్ వీడియో), రిఫార్మ్‌డ్ (జియో హాట్ స్టార్), అండర్ ఏ డార్క్ సన్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), జియామ్ (నెట్ ఫ్లిక్స్)
- జులై 10 - 7 బియర్స్ (యానిమేటెడ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), బ్రిక్ (నెట్ ఫ్లిక్స్), ఏ బ్రదర్ అండ్ సెవెన్ సిబ్లింగ్స్ (నెట్ ఫ్లిక్స్)
- జులై 11 - నరివెట్ట (సోనీ లివ్), ఆప్ జైసా కోయి (నెట్ ఫ్లిక్స్), కలియుగం (సన్ నెక్స్ట్), మిస్టర్ అండ్ మిస్ బ్యాచిలర్ (మనోరమ మ్యాక్స్), కర్కి (సన్ నెక్స్ట్), మిస్టర్ రాణి (లయన్స్ గేట్ ప్లే), స్పెషల్ ఓపీఎస్ (జియో హాట్ స్టార్), ఏ మోస్ట్ కాప్స్ (నెట్ ఫ్లిక్స్), ఫోర్ ఇయర్స్ లేటర్ (లయన్స్ గేట్ ప్లే), మేడ్ యాజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (నెట్ ఫ్లిక్స్), ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 9 (జియో హాట్ స్టార్), డ్రాప్ (ప్రైమ్ వీడియో), నోబు (ప్రైమ్ వీడియో), పేవ్‌మెంట్స్ (MUBI), సావరిన్ (ప్రైమ్ వీడియో)
- జులై 13 - బ్యూరీడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ సీజన్ 6 (జియో హాట్ స్టార్)