S Originals Movie Verse Joins Hand For Om Shanti Shanti Shanti Movie: డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్యూటీ ఈషా రెబ్బా జంటగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి'. ఈ మూవీకి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తుండగా... అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తుండగా... ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎంతో గర్వకారణం
సినిమాటిక్ స్టోరీని రియల్ లైఫ్ స్టోరీస్‌తో కలగలిపి ఎమోషన్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆడియన్స్‌కు అందించడం మాకు ఎంతో గర్వకారణమని 'IN10' మీడియా ఎండీ ఆదిత్య పిట్టె తెలిపారు. 'మూవీవర్స్ స్టూడియోస్, ఎస్ ఒరిజినల్స్ మధ్య ఈ భాగస్వామ్యం కెమెరా ముందు, వెనుక గొప్ప టీంను ఓ చోట చేర్చింది. 'రక్కయ్యే' మూవీ విజయవంతమైన ప్రకటన తర్వాత, మూవీవర్స్ ఇండియన్ కల్చర్ గొప్పతనాన్ని ప్రతిబింబించే లోకల్ కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది.' అని చెప్పారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌ను మించి
'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ కేవలం వినోదం మాత్రమే కాదని... అంతకు మించని మూవీ వర్స్ స్టూడియోస్ సీఈవో వివేక్ కృష్ణ తెలిపారు. 'ఆడియన్స్‌కు ఎమోషన్‌గా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా అద్భుతమైన నటన ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.' అని అన్నారు.
వారి యాక్టింగ్ అదుర్స్
ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా వారి రోల్స్‌కు ప్రాణం పోశారని ఎస్ ఒరిజినల్స్ వ్యవస్థాపకులు సృజన్ యరబోలు తెలిపారు. ''35 చిన్న కథ కాదు' మూవీ సక్సెస్ తర్వాత, మరోసారి ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కంటెంట్ అందించడం చాలా సంతోషం. ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులకు లోతుగా కనెక్ట్ అవుతుంది.' అని చెప్పారు.
మలయాళ మూవీకి రీమేక్
ఈ మూవీలో తరుణ్, ఈషా రెబ్బాలతో పాటు బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'జయ జయ జయహే' మూవీకి ఇది రీమేక్. బసెల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ జంటగా నటించిన ఈ మూవీ 2022లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో తరుణ్ భాస్కర్ హీరోగా 'ఓం శాంతి శాంతి శాంతి'గా రీమేక్ చేశారు.
ఫస్ట్ మూవీ 'పెళ్లి చూపులు'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ అదే జోష్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' తెరకెక్కించారు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'కీడా డోలా'తో అలరించారు. ఈ సినిమాలో ఆయన ఓ కీ రోల్ కూడా చేశారు. ఇప్పుడు హీరోగా 'ఓం శాంతి శాంతి శాంతి'తో రాబోతున్నారు. ఇక 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా... అమీ తుమీ, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, రాగల 24 గంటల్లో, సవ్యసాచి మూవీస్‌లో తన నటనతో మెప్పించారు.