ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత లగడపాటి శిరీష్ తనయుడు సహిదేవ్ విక్రమ్ మరో కీలక పాత్ర చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు.
ఇప్పటికే సినిమా టీజర్, పోస్టర్స్ ను విడుదల చేశారు. కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడడం వంటివి ట్రైలర్ లో చూపించారు.
తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయితో ప్రేమలో పడ్డ హీరో ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో చూపించారు. ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ కి హీరోకి మధ్య లిప్ లాక్ ఉంది. తొలిసారి అనుపమ ఇలాంటి సన్నివేశంలో నటించి షాకిచ్చింది. సినిమాలో ఇంకెన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయో.. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, మది సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..