దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యారు. ఉదయం 9.24 గంటలకు, శుభ ముహూర్తాన పూజా చౌదరితో ఆయన ఏడు అడుగులు వేశారు. వీరి వివాహానికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వేషన్ వేదిక అయ్యింది.   


Venky Atluri Weds Pooja Chowdary : వెంకీ అట్లూరి వివాహానికి శ్రీమతి శాలినితో కలిసి హీరో నితిన్ హాజరు అయ్యారు. వాళ్ళిద్దరి కలయికలో 'రంగ్ దే' సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ కీర్తీ సురేష్ కూడా పెళ్ళికి వచ్చారు. మరో దర్శకుడు వెంకీ కుడుములతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 


కథానాయకుడిగా వచ్చి... 
దర్శకుడిగా మారిన వెంకీ!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెంకీ అట్లూరి ప్రయాణం కథానాయకుడిగా మొదలు అయ్యింది. మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన 'స్నేహ గీతం'లో ఆయన ఓ హీరోగా నటించారు. ఆ సినిమాకు మాటలు కూడా రాశారు. ఆ తర్వాత మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'ఇట్స్ మై లవ్ స్టోరీ'కి కూడా మాటలు రాశారు. 'కేరింత'కు ఆయన రైటర్ కూడా!


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?  


హీరోగా చిత్రసీమకు వచ్చిన వెంకీ అట్లూరి... వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన 'తొలిప్రేమ'తో దర్శకుడిగా మారారు. ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత అఖిల్ అక్కినేని, నిధీ అగర్వాల్ జంటగా 'మిస్టర్ మజ్ను', నితిన్, కీర్తీ సురేష్ జంటగా 'రంగ్ దే' సినిమాలు చేశారు. ఇప్పుడు ధనుష్ హీరోగా 'సార్' చేస్తున్నారు.  త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...  


'సార్' సినిమాకు వస్తే... తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ధనుష్ హీరోగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రమిది. తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ధనుష్‌కు తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రమిది. విద్యా వ్యవస్థ తీరు తెన్నులు మీద సాగే కథతో సినిమా తెరకెక్కింది. 


'మాస్టారు మాస్టారు... నా మనసును గెలిచారు! అచ్చం నే కలగన్నట్టే... నా పక్కన నిలిచారు' అంటూ సాగే తొలి గీతాన్ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. దానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సినిమాలో 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్. 


'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ : పి.డి.వి. ప్ర‌సాద్‌.