వెండితెరపై లిప్ లాక్స్ ఉంటాయి. సినిమాల్లో మూతి ముద్దులు సహజమే. మరి, టీవీల్లో? సీరియళ్ళు, షోల్లో ఉంటాయా? లిప్ లాక్ ఇచ్చి నిరుపమ్ పరిటాల కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారా? 'క్యాష్' షో లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అదే సందేహం కలుగుతోంది.


నిరుపమ్ పరిటాల, ఆయన సతీమణి మంజుల 'క్యాష్' షోకు వచ్చారు. ఇంట్రడక్షన్ డ్యాన్సులు ఉంటాయి కదా! డ్యాన్స్ చేస్తూ చేస్తూ... నిరుపమ్ పరిటాలకు వైఫ్ మంజుల కిస్ ఇచ్చినట్టు చూపించారు. అదీ లిప్ కిస్! డైరెక్టుగా పెదవులు కలిసినట్టు చూపించలేదు. కానీ, కలిసిన ఫీలింగ్ కలిగించారు. అప్పుడు చుట్టుపక్కల జనాలు అరిచిన అరుపులు కూడా వినిపించాయి.


"మొన్ననే ఒక ముద్దుల టాస్క్ పెట్టారు. దాని కింద కామెంట్స్ చదివా. 'ఇంకెందుకు రా? ఫస్ట్ నైట్ కూడా లైవ్ లో టెలికాస్ట్ చేసేయ్' అని ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమేం చదవాల్సి వస్తుందో?" అని సుమ స్పందించారు.


సినిమాల్లో లిప్ లాక్స్ కామన్. సన్నివేశం డిమాండ్ చేయడంతో చాలా మంది మూతి ముద్దలు పెట్టారు. అఫ్ కోర్స్... కొంత మంది రియల్ లైఫ్ కపుల్స్ సోషల్ మీడియాలో లిప్ లాక్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకోన్ ఫొటో సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని రణ్ వీర్ పోస్ట్ చేశారు. ఈ ట్రెండ్ బుల్లితెరకు నిరుపమ్ తీసుకు వస్తారేమో!?


Also Read: డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...


బుల్లితెర వీక్షకులకు నిరుపమ్ పరిటాలను ప్రత్యేకంగా, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు పేరుతో కంటే డాక్టర్ బాబుగా ఎక్కువ మందికి తెలుసు. 'కార్తీక దీపం' సీరియల్ సక్సెస్, క్రేజ్ అటువంటిది. టీవీల్లో ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. లిప్ లాక్స్ పరంగానూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేలా ఉన్నారు.


Also Read: హీరోయిన్ పేరుతో జనాలకు వల వేస్తున్న కేటుగాడు