Hi Nanna digital streaming platform - Netflix India: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొత్త సినిమా 'హాయ్ నాన్న'. ఆయన జోడీగా 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించారు. వాళ్ళిద్దరి కుమార్తెగా 'బేబీ' కియారా ఖన్నా కనిపించారు. డిసెంబర్ 7న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. మరి, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? 'హాయ్ నాన్న' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారు? అంటే... 


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'హాయ్ నాన్న' 
Netflix acquires Hi Nanna movie digital streaming rights: హాయ్ నాన్న డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల వెర్షన్స్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. 


Also Read: హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?


సోషల్ మీడియాలో సూపర్ పాజిటివ్ టాక్!
Hi Nanna Review In Telugu : 'హాయ్ నాన్న' సినిమాకు సోషల్ మీడియాలో సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. మిడ్ నైట్ ప్రీమియర్ షోస్ నుంచి సినిమా సూపర్ అంటూ నెటిజనులు చెబుతున్నారు. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా తమ నటనతో ఏడిపించారని, నాని కెరీర్ మొత్తం మీద ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుందని ట్వీట్స్ చేశారు. మరో వైపు విమర్శకుల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ ఏమీ కాలేదు. ఏవరేజ్ నుంచి అబౌవ్ ఏవరేజ్ అని చెబుతున్నారు.


Also Readజెర్సీ నుంచి హాయ్ నాన్న వరకు... నాని లాస్ట్ ఐదు సిన్మాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, ఎంత కలెక్ట్ చేస్తే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ అవుతుంది?


 


అసలు 'హాయ్ నాన్న' కథ ఏమిటి?
సినిమా కథ విషయానికి వస్తే... విరాజ్ (నాని) ముంబైలో పెద్ద పేరు ఉన్న ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతని ఆరేళ్ళ కుమార్తె ఉంది. ఆ అమ్మాయి పేరు మహి ('బేబీ' కియారా ఖన్నా). రాత్రిపూట పాపకు కథలు చెప్పడం తండ్రి అలవాటు. అతను చెప్పే కథల్లో ఎప్పుడూ నాన్న ఉంటాడు. అయితే... అమ్మ కథ చెప్పమని ప్రతిసారీ పాప అడుగుతూ ఉంటుంది. తండ్రి ఎప్పటికీ చెప్పకపోవడంతో ఒకరోజు చెప్పకుండా మహి బయటకు వెళుతుంది. ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్ వస్తాడు. కంపల్సరీ అమ్మ కథ చెప్పాలని పట్టుబట్టడంతో మరో దారి లేక చెప్పడం మొదలు పెడతాడు. 


Also Read'హాయ్ నాన్న' క్రిటిక్ రేటింగ్... నాని, మృణాల్ ఠాకూర్ సినిమా హిట్టా? ఫట్టా?


విరాజ్ పెద్ద ఫోటోగ్రాఫర్ కాకముందు... అతడికి వర్ష (ఆ పాత్రలో యష్ణను మహి ఊహించుకుంటుంది - అంటే మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. వర్ష సంపన్నురాలు. విరాజ్ మిడిల్ క్లాస్. తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా విరాజ్ ఇంటికి వస్తుంది. అతడిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు ఓ అందమైన పాప జన్మిస్తుంది. అదీ అమ్మ కథ. విరాజ్ కథ చెబుతుంటే అతడు ప్రేమించిన అమ్మాయి పాత్రలో తనను తాను ఊహించుకుంటుంది యష్ణ. విరాజ్‌ మీద ఇష్టం పెంచుకుంటుంది. ప్రేమిస్తుంది. 


పాప జన్మించిన తర్వాత ఏమైంది? విరాజ్ ఎందుకు ఒంటరి అయ్యాడు? వర్ష ఎక్కడికి వెళ్ళింది? వర్ష కుటుంబ నేపథ్యం ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? ఓ వారంలో అరవింద్ (అంగద్ బేడీ)తో పెళ్లి పెట్టుకుని విరాజ్‌తో ప్రేమలో పడిన యష్ణ... ప్రేమించిన వ్యక్తికి తన మనసులో మాటను చెప్పిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.