నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). ఇందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేసిన విషయాన్ని నిన్ననే వెల్లడించారు. 


'ధర్మ క్షేత్రం'లో బాలకృష్ణ, దివ్య భారతిపై తెరకెక్కించిన 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...' పాటను 'అమిగోస్' కోసం రీమిక్స్ చేశారు. దానిని స్వర్గీయ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ఈ రోజు ఆ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈ నెల 29న విడుదల కానుంది. 


బాలకృష్ణ పాటను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 'పటాస్' కోసం 'అరె ఓ సాంబ...' సాంగ్ రీమిక్స్ చేశారు. మరోసారి బాబాయ్ పాటతో అభిమానులకు కనువిందు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ''బాబాయ్ పాటల్లో నాకు ఇష్టమైన వాటిలో 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాట ఒకటి. దీనిని రీ క్రియేట్ చేయడం ఎంజాయ్ చేశా. మేం ఎంజాయ్ చేసినంత మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను'' అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.


Also Read : రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ - ఏం చేస్తున్నారంటే? 






బడ్జెట్ అంతా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో!
ఆల్రెడీ 'అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ హక్కులను తొమ్మిది కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. 


Also Read : తెలుగులో నా నటనకు ప్రాణం పోశాడు, మూర్తి మరణం నాకు ఎంతో లోటు - సూర్య ఎమోషనల్ ట్వీట్


సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... భారీ విజయాలు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి. అందువల్ల, సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటు పలికే అవకాశం ఉంది.   


మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్... 'అమిగోస్'లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళ మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే 'యెక యెక...' పాటను తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురి క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం చూపించారు. బీచ్ ఏరియాలో మాంచి స్టైలిష్, కలర్ ఫుల్ అమ్మాయిల మధ్య పాటను చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ మాత్రమే కాదు... నటుడు బ్రహ్మాజీ కూడా పాటలో ఉన్నారు. జిబ్రాన్ సంగీతంలో  'యెక యెక...' పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. అనురాగ్ కులకర్ణి పాటను ఆలపించారు. 


కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ!
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'అమిగోస్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.