యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అంటే... ఈ రోజు ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. అమెరికా టూర్ ముగించుకుని కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ఇండియా వచ్చారు. ఇప్పుడు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. 


యాడ్ షూట్ చేసిన ఎన్టీఆర్
అవును... ఎన్టీఆర్ ఈ రోజు షూటింగ్ చేశారు. అయితే, అది సినిమా కోసం కాదు! ఒక యాడ్ కోసం! రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన యాడ్ షూటింగులో పాల్గొన్నారు. కొంత మంది అభిమానులు అక్కడికి వెళ్ళి ఆయనను కలిశారు. తారక రాముడితో కలిసి ఫోటోలు దిగారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' గురించి అంతర్జాతీయ పత్రికలు రాసిన కథనాలపై ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
 
ఎన్టీఆర్ 2023లో చేసిన ఫస్ట్ షూటింగ్ ఇదేనని సమాచారం. త్వరలో కొరటాల శివ సినిమా కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. పూజ చేసిన తర్వాత షూట్ స్టార్ట్ అవుతుందట.
 
ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమా లేదు
ఎన్టీఆర్ కొత్త సినిమా ఈ ఏడాదిలో లేనట్టే! 2023లో కొరటాల శివ సినిమా విడుదల చేయడం లేదని కొన్ని రోజుల క్రితం స్పష్టంగా చెప్పేశారు. 2024లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5న ఆ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది రావడం లేదని కొంత మంది ప్రేక్షకులు నిరాశ చెందినా... అప్ డేట్ వచ్చిందని హ్యాపీగా ఫీలయ్యారు.


Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే?   


ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు. జాన్వీ అయితే కన్ఫర్మ్ అయ్యిందని టాక్. 


ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు!
ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 30 సెట్స్ మీదకు వెళ్ళనుంది. దర్శకుడు కొరటాల శివ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫినిష్ చేసారని తెలిసింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత బ్రేకులు లేకుండా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'బృందావనం' చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ చేశారు. 


Also Read : 'హంట్'లో గుట్టు విప్పేశారు - రెగ్యులర్ సినిమాలు చేయనన్న సుధీర్ బాబు


నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.