''నేను రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నీ డిఫరెంట్ సినిమాలే. ఇప్పుడీ 'హంట్' కూడా చాలా డిఫరెంట్ సినిమా'' అని సుధీర్ బాబు అన్నారు. 


సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. థియేటర్లలో గురువారం సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషంగా ఉందని హీరో, దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు.


మొదట భయపడిన మాట వాస్తవమే!
'హంట్' విడుదలకు ముందు, తర్వాత క్లైమాక్స్ గురించి డిస్కషన్ నడిచింది. ఈ సినిమా మలయాళ హిట్ 'ముంబై పోలీస్'కు రీమేక్ అని ప్రచారం జరిగింది. స్టోరీ బాబీ - సంజయ్ అని టైటిల్ కార్డ్స్‌లో వేయడం ద్వారా ఒరిజినల్ రైటర్లకు మూవీ యూనిట్ క్రెడిట్స్ ఇచ్చింది. సో... ఆ విషయంలో క్లారిటీ వచ్చింది.


సినిమా విడుదలకు ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని తనకు ఆసక్తిగా ఉందని సుధీర్ బాబు తెలిపారు. ఆ విషయంలో తాము భయపడిన మాట వాస్తవమేనని ఈ రోజు సక్సెస్ ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పారు. అయితే... చివరి 20 , 30 నిముషాలకు అద్భుత స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. ''సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులంతా సెకండాఫ్‌లోని 30 మినిట్స్ ఎక్సట్రాడినరీ అని చెబుతున్నారు. థియేటర్లలో సినిమా చూడండి'' అని సుధీర్ బాబు చెప్పారు. 


సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్! 
కమర్షియల్ స్పేస్‌లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసే హీరోలు ఎవరూ 'హంట్'లో సుధీర్ బాబు చేసిన క్యారెక్టర్ చేయరని... అటువంటి పాత్రలు చేయడానికి సందేహిస్తారని దర్శకుడు మహేష్ వ్యాఖ్యానించారు. ధైర్యంగా సినిమా చేసిన సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్ చెప్పారు. మెజారిటీ ప్రేక్షకులు హీరో రోల్ చూసి మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన హీరోలో ఉంటే ఇటువంటి క్యారెక్టర్లు, సినిమాలు వస్తాయన్నారు. భవ్య క్రియేషన్స్ వి. ఆనంద ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి తమకు అండగా ఉన్నారని చెప్పారు. 


Also Read : తెలుగులో నా నటనకు ప్రాణం పోశాడు, మూర్తి మరణం నాకు ఎంతో లోటు - సూర్య ఎమోషనల్ ట్వీట్


సినిమా విడుదల ముందు ట్విస్ట్ గురించి అడిగితే మౌనం వహించిన సుధీర్ బాబు, దర్శకుడు మహేష్... విడుదలైన తర్వాత ధైర్యంగా అసలు గుట్టు విప్పేశారు. ట్విస్ట్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పారు. ఈ సక్సెస్ ప్రెస్‌మీట్‌లో నటుడు భరత్ నివాస్,  సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ పాల్గొన్నారు. ''సినిమాకు లభిస్తున్న స్పందన సంతోషంగా ఉంది. కొత్తది అటెంప్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు గారు, శ్రీకాంత్ గారు, భరత్... ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సుధీర్ బాబు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. ప్రేక్షకులు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాలని ఆశిస్తున్నాను'' అని సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ అన్నారు.


Also Read  : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే?