ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'పుష్ప: ద రైజ్' కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ... ఐదు భాషల్లోనూ ఆన్ టైమ్ రిలీజ్ అవుతుందని, అమెరికాలోనూ షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్ షోలు పడతాయని మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలో థియేటర్ల సంఖ్య పక్కన పెడితే... అమెరికాలో 400లకు పైగా థియేటర్లలో 'పుష్ప' రిలీజ్ అవుతోంది. ప్రస్తుతానికి 420 థియేటర్లకు అటు ఇటుగా అల్లు అర్జున్ సినిమాకు లభించాయి. అంత కంటే ఎక్కువ థియేటర్లలో 'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్ కానుంది. అమెరికాలో థియేట్రికల్ రిలీజ్ విషయంలో బన్నీని నాని బీట్ చేయబోతున్నారు.


'పుష్ప' కంటే 'శ్యామ్ సింగ రాయ్'కు ఎక్కువ థియేటర్లు లభించడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది... ఈ రోజు (డిసెంబర్ 16న) ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'. ఈ హాలీవుడ్ సినిమాకు అమెరికాలో భారీ సంఖ్యలో థియేటర్లు లభించాయి. 'పుష్ప' సినిమాకు అక్కడ క్రేజ్ ఉన్నప్పటికీ... అమెరికన్లలో 'స్పైడర్ మ్యాన్' సినిమాకు ఉన్న క్రేజ్ ముందు సరిపడా సంఖ్యలో థియేటర్లు లభించడం లేదు. రెండో కారణం... డిస్ట్రిబ్యూటర్. 'పుష్ప' విడుదల అయిన వారం తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' వస్తోంది. అప్పటికి 'స్పైడర్ మ్యాన్' ఫీవర్ కొంత తగ్గుతుంది. 'పుష్ప' సినిమాను కూడా చాలా మంది చూసి ఉంటారు. థియేటర్లు దొరకడం ఈజీ. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో 'శ్యామ్ సింగ రాయ్'ను రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ అయ్యారు. సుమారు 450 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.





అమెరికాలో 'పుష్ప' ప్రీ సెల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. వీకెండ్, ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు నమోదు చేసేలా ఉంది. 'శ్యామ్ సింగ రాయ్'కు ఎలా ఉంటుందో చూడాలి.






Also Read: మరో కపూర్‌కు కరోనా...
Also Read: అక్క‌డ తెలుగు సినిమాలు చూడ‌టం 'ఆర్య‌'తో మొద‌లుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి