నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీకోసం సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమాలు చాలావరకూ మంచి టాక్ సంపాదించుకున్నాయి. ఈ కోవలోనే లవ్ స్టోరీ వినాయకచవితి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అక్కనేని అభిమానులకు మళ్లీ షాక్ తగిలింది. సెప్టెంబరు 10న విడుదల కావాల్సిన లవ్ స్టోరీ అక్టోబరుకి వాయిదా వేసినట్టు  సమాచారం.




అక్టోబరు రెండోవారంలో దసరా కావడంతో అప్పటి వరకూ కాకుండా. సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1న విడుదల చేసేయోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో థియేటర్ల సమస్యల ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. ఈ సమస్య సెప్టెంబరు వరకూ పరిష్కారంఅయ్యే సూచనలు లేకపోవడంతో లవ్ స్టోరీని అక్టోబరుకి వాయిదా వేయడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారట.


Also read:తలకు గాయం.. చిందే రక్తం.. అయినా ఆగని షూటింగ్‌.. ప్రియాంక ఫొటో వైరల్‌తలకు గాయం.. చిందే రక్తం.. అయినా ఆగని షూటింగ్‌.. ప్రియాంక ఫొటో వైరల్‌




Also Read: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా చూసిన మహేశ్ బాబు.. సుధీర్ బాబు టెన్షన్!


ఇక లవ్ స్టోరీ వాయిదా సీటీమార్ సినిమాకి కలిసొచ్చిందనే చెప్పాలి. సంపత్ నంది దర్సకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో  గోపీచంద్ –తమన్నా నటించారు. భూమిక కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేసుకుంటూ  ఫైనల్ గా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే మూడు రోజులు తిరక్కుండానే మళ్ళీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని మార్చారు. 'లవ్ స్టోరీ' సినిమాని పోస్ట్ పోన్ చేయాలని అనుకోవడమే కారణం అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్..తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపించనున్నారు.


Also Read:పుష్ప రాజ్‌ని ఢీ కొట్టబోతోన్న IPS భన్వర్ సింగ్ షెకావత్.. తగ్గేదే లే అన్నట్టున్న ఫహద్ ఫస్ట్ లుక్..


ఇక అదే రోజు కంగనా రనౌత్ 'తలైవి' థియేట్రికల్ రిలీజ్ అవుతుండగా, నాని 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలవుతోంది. ఏ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


Also Read:అఖిల్-పూజాహెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు


Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!


Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు