కేరళకు చెందిన ఉత్తర(26). ఏడాది క్రితం పాము కాటుతో చనిపోయింది. అయితే మహిళ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డ మృతిపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తమ కుమార్తె చనిపోయింది.. పాము కాటుతోనే గానీ.. సాధారాణంగా కాదు అనేది వాళ్ల అనుమానం. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర భర్త సూరజ్ మాత్రం.. పాము కాటుతోనే చనిపోయిందని అందరినీ నమ్మించుకుంటూ వచ్చాడు. సీన్ లోకి దిగిన పోలీసులు అసలు విషయం బయటకు రప్పించారు. ఇంట్రస్టింగ్ పద్ధతిలో నిందితుడిని పట్టుకున్నారు.
ఈ కేసుపై సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఇందుకు గానూ ఓ డమ్మీ బొమ్మను బెడ్ పై పడుకొబెట్టారు. బతికున్న పామును బెడ్ పై వదిలారు. కొల్లం జిల్లాలోని అటప్పిలో రాష్ట్ర అటవీ శాఖ శిక్షణ కేంద్రంలో ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరింగిది. ఈ కేసులో చాలా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అసలు నాగుపాము ఎంత ఫోర్సుతో కాటు వేస్తుంది? ఎలా వేస్తుంది? అనేది వీడియో రికార్డు చేశారు. అయితే ఉత్తర శరీరంపై పాము కరిచిన చోట 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్లు రెండు గాట్లను గుర్తించారు పోలీసులు. భర్తే నాగుపాముతో కరిపించాడని నిర్ధారించుకున్న పోలీసులు.. నిజానిజాలు తెలుసుకునేందుకు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.
Also Read: Nirmal News: 10 నిమిషాల్లో ఇంటికి.. ఇంతలో ఘోరం.. పెళ్లి కూతురు, తండ్రి అక్కడికక్కడే మృతి
Kothagudem: గవర్నమెంట్ టీచర్‌కి 21 ఏళ్ల కఠిన జైలు శిక్ష.. సంచలన తీర్పు, ఇంతకీ ఆయనేం చేశాడంటే..
ఒక డమ్మీ బొమ్మను బెడ్ పై పడుకోబెట్టిన పోలీసులు... ఆర్టిఫియల్ హ్యాండ్ కు మాంసపు ముద్దను అతికించి.. పదే పదే పాముతో కాటు వేయించారు. సహజంగా నాగుపాము కాటు వేస్తే 1.7 సెంటి మీటర్ల గాటు మాత్రమే పడుతుందని.. ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో గుర్తించారు పోలీసులు. పాముతో బలవంతంగా ఆర్టిఫియల్ హ్యాండ్ పై కాటు వేయించిన ఇన్వెస్టిగేటర్.. 2.4 సెంటీ మీటర్ల లోతైన గాటు పడినట్టు గుర్తించారు.
ఇది ఉత్తర శరీరంపై పడిన పాముగాటుతో సమానంగా కనిపిస్తోంది. దీంతో పాముతో బలవంతంగా కాటు వేయించి చంపేసినట్టుగా క్లారిటీకి వచ్చారు పోలీసులు. బలవంతంగా పాముతో కాటు వేయిస్తే... ఎలా ఉంటుందని స్పష్టంగా చూపించారు పోలీసులు. అయితే కేరళ పోలీసులు చేసిన ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర భర్త.. సూరజ్ పాములో పట్టే వ్యక్తి నుండి నాగుపామును కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆమె మంచం మీదకు నాగుపామును తీసుకెళ్లడానికి ముందు.. ఉత్తరకు నిద్రమాత్రలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తరను వదిలించుకోవడానికి చంపేసినట్టు దర్యాప్తులో తేలింది. అయితే ఇదే కాదు.. అంతకుముందు కూడా సూరజ్ ఓసారి ఉత్తరను చంపాలని ప్రయత్నించాడు. రెండో ప్రయత్నంలో ఆమెను చంపేశాడు.
Also Read: YS Viveka murder Case : వివేకా పోస్టుమార్టం రిపోర్టుపై సీబీఐ పరిశీలన.. దస్తగిరిపై కొత్తగా అనుమానాలు..!