భారతదేశ దిగ్గజ టెలికాం ఆపరేటర్ జియో నుంచి త్వరలో విడుదల కానున్న జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రిలయెన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీని సేల్ కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం అవుతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి.
జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? (అంచనా)
జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ తేదీలకు సంబంధించి పలు టెక్ కంపెనీలు నివేదికలు వెల్లడించాయి. వీటి ప్రకారం.. జియో కొత్త ఫోన్ ప్రీబుకింగ్స్ ఇండియాలో వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్ల కోసం జియో తన రిటైల్ భాగస్వాములతో చర్చలు సైతం ప్రారంభించినట్లు నివేదికలో తెలిపాయి. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన రిలయెన్స్ వార్షిక సదస్సులో సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో కొత్త ఫోన్లను సెప్టెంబర్ 10 కల్లా విడుదల చేస్తామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫోన్ విడుదల తేదీపై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
జియో ఫోన్ నెక్స్ట్ ధర (అంచనా)
జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉంది. దీని సేల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. దీనిలో 720x1,440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉండనుంది.
ఇందులో 2జీబీ, 3 జీబీ ర్యామ్.. 16జీబీ, 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఫొటోలు, వీడియోల కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అందించారు. బ్యాటరీ కెపాసిటీ 2500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. డ్యూయల్ సిమ్‍లను సపోర్ట్ చేయనుంది. ఇందులో బ్లూటూత్ వీ4.2, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
Also Read: iPhone 13 Launch: ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 13 లాంచింగ్ డేట్ ఇదే!
Also Read: Mi TV 5X: ఎంఐ కొత్త టీవీ వచ్చేసింది... బడ్జెట్ రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లు