దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ తన సరికొత్త స్మార్ట్ టీవీని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో భాగంగా ఎంఐ టీవీ 5ని ఈరోజు విడుదల చేసింది. గతేడాది షియోమీ నుంచి విడుదలైన ఎంఐ టీవీ 4ఎక్స్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది. ఎంఐ టీవీ 5ఎక్స్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే 40 వాట్స్ స్పీకర్లు అందించారు. మన ఇంట్లోని వెలుతురుకు తగినట్లుగా బ్రైట్ నెస్ మారుతుండటం దీనిలో మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు. పాచ్‌వాల్ 4 ఇంటర్‌ఫేస్‌తో ఇది పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్‌ని సులభంగా యాక్సెస్ చేసేలా ఫార్ ఫీల్డ్ మైక్‌లను అందించారు.
ఎంఐ టీవీ 5ఎక్స్ ధర..
ఎంఐ టీవీ 5ఎక్స్‌లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 43 అంగుళాల వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.41,999గా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 47,999గా నిర్ణయించారు. దీని సేల్ సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనిని ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ హోం, ఎంఐ స్టూడియోల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఎంఐ టీవీ 5ఎక్స్ స్పెసిఫికేషన్లు..
ఎంఐ టీవీ 5ఎక్స్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 అందించారు. అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ఫొటో ఎలక్ట్రిక్ సెన్సార్ ద్వారా మన ఇంట్లో వెలుతురుకు తగినట్లుగా టీవీలో బ్రైట్‌నెస్ ఆటోమెటిగ్గా మారుతుంది. స్క్రీన్ టూ బాడీ రేషియో 96.6గా ఉంది. సన్నని అంచులు, మెటల్ ఫినిష్ తో స్టైలిష్ లుక్ అందించారు. 4కే రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
డోల్బీ విజన్, హైబ్రిడ్ లాగ్ గామా, హెచ్‌డీఆర్ 10, హెచ్‌డీఆర్ 10 ప్లస్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 40 వాట్స్ స్టీరియో స్పీకర్లను అందించారు. 43 అంగుళాల టీవీలో మాత్రం 30 వాట్స్ మాత్రమే ఉంటాయి. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కిడ్స్ మోడ్, పేరెంటల్ లాక్, సేఫ్ సెర్చ్ ఫీచర్లు ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంది.
Also Read: Redmi 10 Prime: రెడ్‌మీ 10 ప్రైమ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రూ.10 వేలలోపు ధర!