స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు పనులు ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్నాయి. యూజర్లు సైతం బయటకు వెళ్లకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులతో పాటు పలు బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నారు. దాంతో సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం గూగుల్ 8 ప్రమాదకరమైన క్రిప్టోకరెన్సీ యాప్‌లపై నిషేధం విధించింది. తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌లను తొలగించింది.
క్రిప్టో కరెన్సీ యాప్స్..
గత కొంతకాలం నుంచి ఆన్‌లైన్ కరెన్సీ, పేపర్ లెస్ కరెన్సీ అంటూ బిట్ కాయిన్, బిట్ ఫండ్స్ లాంటి క్రిప్టో కరెన్సీ వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో వీటికి మంచి రెస్పాన్స్ ఉంది. అయితే బిట్‌కాయిన్, బిట్‌ఫండ్స్ లాంటి మరికొన్ని యాప్స్ ద్వారా యూజర్ల తమ వ్యక్తిగత వివరాలు లీక్ అవుతున్నాయి. క్రిప్టోకరెన్సీ యాప్‌లు వాడుతున్న యూజర్ల స్మార్ట్‌ఫోన్ నుంచి వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు పాల్పడి స్మార్ట్ ఫోన్ యూజర్లను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!
రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు..
కొన్ని ప్రకటనలు సైతం క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు ఈజీగా ట్రాప్ చేస్తుంటారని సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ఆ ప్రకటనలు కనిపించే 8 ప్రమాదకరమైన యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. ఈ యాప్‌లు యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ కింద రూ.1,115 వసూలు చేస్తున్నాయని, అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
గూగుల్ తాజాగా తొలగించిన ప్రమాదకర యాప్స్ ఇవే...
బిట్‌ఫండ్స్ - క్రిప్టో క్లౌడ్ మైనింగ్
బిట్‌కాయిన్ మైనర్ - క్లౌడ్ మైనింగ్
బిట్‌కాయిన్ (బీటీసీ) - పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్
క్రిప్టో హోలిక్ - బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్
డెయిలీ బిట్‌కాయిన్ రివార్డ్స్ - క్లౌడ్ బేస్డ్ మైనింగ్ సిస్టమ్
బిట్‌కాయిన్ 2021
మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ బీటీసీ మైనర్
ఎథెరియం (ఈటీహెచ్) - పూల్ మైనింగ్ క్లౌడ్
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎగబాకిన వెండి.. మీ నగరంలో నేటి ధరలివీ..