ఏపీలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో అవకతవకలు రోజుకొకటి వెలుగుచూస్తుంది. కొన్ని కార్యాలయాలు అక్రమాలకు అడ్డా మారుతున్నాయి. మరికొన్ని చోట్ల నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. ఈ విషయంపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యి చర్యలకు ఆదేశించారు. తాజాగా మరో కోణం బయటపడింది. నిషిద్ధ జాబితాలోని భూముల సర్వే నెంబర్లకు ఓ అక్షరాన్ని చేర్చి రిజిస్ట్రేషన్లు చేయడం తాజాగా చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ నిషిద్ధ భూముల వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లాలో నెల వ్యవధిలో 4 గురు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు పడింది. రిజిస్ట్రార్లపై అందిన ఫిర్యాదులపై ఆరా తీస్తుండటంతో ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.


అదనంగా ఎ జోడించి...


పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు సుజాత భీమవరం ప్రాంతానికి సంబంధించిన సర్వే నంబర్లు 579/2, 583/ఎకు అదనంగా ‘ఎ’ లేటర్ జోడించారు. ఎనీవేర్‌ విధానంలో సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దస్తావేజుల సమాచారాన్ని ఆమె భీమవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తెలిపారు. ఆ భూముల సర్వే నెంబర్లు  నిషిద్ధ జాబితాలో ఉన్నాయని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆమె సర్వే నెంబర్లకు అదనంగా ‘ఎ’ చేర్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేశారు.  స్టాంపు, రిజిస్ట్రేషన్‌ డ్యూటీని కూడా తగ్గించారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా జరిగినట్లు తెలుస్తోంది. 


Also Read: AP News: విద్యా సంస్థల పరిధిలో సిగరెట్లు అమ్మితే జరిమానా... వంద గజాలలోపు అమ్మితే చర్యలు... వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు


మార్కెట్ విలువను తగ్గించి  


జిల్లాలోని కొవ్వూరులో 2.6 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో మార్కెట్‌ విలువను అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ రూ.4.78 కోట్లకు గానూ రూ.1.25 కోట్లకు మార్కెట్‌ విలువ తగ్గించి రిజిస్ట్రేషన్‌ చేసేశారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.26 లక్షల మేర నష్టం వచ్చింది. ఈ తంతు తాజాగా వెలుగులోకి రావడంతో ప్రస్తుత పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న ఆమెపై వేటు పండింది. నరసాపురం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ కూడా నిషిద్ధ భూమి వ్యవహారంలో కోర్టు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు ఉన్నా రిజిస్ట్రేషన్‌ చేసేశారు. అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌రిజిస్ట్రార్‌ ఇలాగే ఈ విషయంలో సస్పెండ్‌ అయ్యారు.


Also Read: In Pics: టాలీవుడ్‌లో రక్షా బంధన్ కళ... సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్


అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్


మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు సత్యనారాయణ కూడా రిజిస్ట్రేషన్ల నిషిద్ధ జాబితాలో ఉన్న అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. సర్వే నంబరు ఆర్‌.ఎస్‌.నెం.123/2 ఉండగా ఆర్‌.ఎస్‌.నంబరు 123/2ఎగా మార్చి 16 ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఏలూరు అధికారులు నిర్థారించారు. 2016లో జిల్లా కలెక్టర్‌ ప్రకటించిన నిషిద్ధ జాబితాలోనూ ఈ భూములు ఉన్నాయి. 


Also Read: Vijayawada Businessman Murder: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులో కోరాడ విజయ్ కుమార్... నిందితుల కోసం అయిదు బృందాలు గాలింపు