విజయవాడ యువ పారిశ్రామిక వేత్త రాహుల్‌ హత్య కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితుడిగా భావిస్తున్న కోరాడ విజయ్ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. తన వాటా కోసం విజయ్‌..  పారిశ్రామిక వేత్త రాహుల్‌ పై ఒత్తిడి తెచ్చారని రాహుల్‌ తండ్రి రాఘవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో  కోరాడ విజయ్ కుమార్‌, అతడి భార్య పద్మజ, రౌడీషీటర్‌ కోగంటి సత్యం, మరో మహిళ గాయత్రి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్థారించారు. 


Also Read: Amaravati Highcourt : నేటి నుండి అమరావతి వ్యాజ్యాల విచారణ..! హైకోర్టు తేల్చేస్తుందా..?


తక్కువ ధరకే కొట్టేయాలని ప్లాన్


విజయవాడ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో నిందితుల కోసం గాలింపును పోలీసులు తీవ్రతరం చేశారు. హత్య జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా గుట్టు వీడడంలేదు. అయితే హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న కోరాడ విజయ్ కుమార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు ప్లాన్ వేసినట్లు విజయ్ కుమార్ డ్రైవర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ విషయంలో ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.


Also Read: Huzurabad: ఈటల రాజేందర్‌కు గట్టి షాక్.. హుజూరాబాద్‌లో మరో కీలక పరిణామం


రాహుల్ మర్డర్ కు స్కెచ్


జిక్సిన్ కంపెనీలో 30 శాతం అంటే రూ.15 కోట్లు విలువ చేసే వాటాను వెనక్కి ఇవ్వాలన్ని రాహుల్‌పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు పెట్టేవాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు రౌడీ షీటర్ కోగంటి సత్యం ప్రయత్నించాడు. అయితే సత్యానికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వీరంతా స్కెచ్ వేశారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు ప్లాన్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌ గా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు దొరికితే ఈ హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.  


 


Also Read: Afghanistan: త్వరలోనే ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం.. తాలిబన్ ప్రతినిధి ప్రకటన