కాబూల్‌ను ఆక్రమించుకున్న వారం రోజుల తర్వాత తాలిబన్లు కీలక ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యుద్ద వాతావరణ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడంతోపాటు ప్రజల్లో నెలకొని ఉన్న భయాలను తొలగించి వారి రక్షణ కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 


తాలిబన్ అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్దీన్ కొత్తప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన  విడుదల చేశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు సాగుతున్నాయని .. ఆప్ఘనిస్థాన్ రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నామన్నారు. అతి త్వరలోనే ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం చూస్తారని అన్నారు. 


తమ రాజకీయ పార్టీల లీడర్లు కాబుల్‌లో సమావేశమయ్యారని.. అందరి ఆలోచనలు తీసుకున్న తర్వాత ఓ నిర్ణయం వెలువడుతుందన్నారు. ఇప్పటికే తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌ కాబుల్ చేరుకున్నారు. ఆయన ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 



శనివారం మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయితో కలిసి కొంతమంది రాజకీయ నాయకులు కలిసి చర్చించారు. హై కౌన్సిల్ ఫర్‌ నేషనల్‌ రీకాన్సిలేషన్  (హెచ్‌ సీఎన్‌ ఆర్‌) హెడ్‌ అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో నెలకొన్న భయాలు తొలగించడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనే చర్చల ఫోకస్ ఉన్నట్టు తాలిబన్లు చెప్పినట్టు టోలో న్యూస్ రిపోర్టు చేసింది. అబ్దుల్లా అబ్దుల్లా ఫేస్‌బుక్ పోస్టు కూడా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. 


మరోవైపు తాలిబన్‌ల ధాటికి  ఆప్ఘనిస్థాన్‌లో ప్రధాన నగరాలన్నీ వారి వశమయ్యాయి. కానీ పంజ్‌షీర్‌ వ్యాలీ మాత్రం హస్తగం కాలేదు. దీన్ని ఆక్రమించుకోవడానికి తాలిబన్లు వస్తే మాత్రం దగీటుగా ఎదుర్కొమంటున్నారు అక్కడి ప్రజలు. 


పంజ్‌షిర్‌కు ముప్పు


కాబూల్‌కు ఉత్తరాన ఉన్న హిందూకుష్ పర్వశ్రేణుల్లో ఈ పంజ్‌షీర్ ఉంది. దీన్ని అహ్మద్‌ షా మౌసద్‌ ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చారు. ఆయన 2001లో చనిపోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అహ్మద్‌ షా మసూద్‌, అమ్రుల్లా సాలేతో కలిసి దీన్ని కాపాడుతూ వస్తున్నారు. 


ఎదుర్కొంటామంటున్న పంజ్‌షిర్‌ అధికారులు


తమ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితల్లో కూడా తాలిబన్ల హస్తగతం కానివ్వబోమని చెబుతున్నారు అహ్మద్‌షా మసూద్. తన తండ్రి చూపిన పోరాట పటిమను చూపేందుకు తామంతీ సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. నిఘా వర్గాలను అప్రమత్తం చేసిన సాలే.. వారి కదలికలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లును తమ ప్రాంతంలో అడుగుపెట్టబోమంటున్నారాయన. నిపుణులు మాత్రం పంజ్‌షీర్‌కు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.  


ALSO READ:తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..