ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల నుంచి వంద గజాల అంటే 300 అడుగులు లోపు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ  కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2007-08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. కానీ ఇవి అమల్లో అంతంత మాత్రమే.  


Also Read: In Pics: టాలీవుడ్‌లో రక్షా బంధన్ కళ... సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్


సిగరెట్లు విక్రయిస్తే జరిమానా


పొగాకు నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టంది. మరీ ముఖ్యంగా విద్యా సంస్థల పరిధిలో ఈ నిబంధనలు అతిక్రమించి దుకాణాల్లో సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించేవారికి రూ.20 నుంచి రూ.200 వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ అధికారం ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు ఉన్న అధికారాలపై వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కల్పిస్తుంది. 


Also Read: Vijayawada Businessman Murder: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులో కోరాడ విజయ్ కుమార్... నిందితుల కోసం అయిదు బృందాలు గాలింపు


సైన్ బోర్డులు ఏర్పాటు


విద్యా సంస్థల ప్రాంగణాల్లో పొగాకు రహిత ప్రాంతం అని తెలిసేలా సూచికలు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలని, పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను ప్రతీ 6 నెలలకు ఒకసారి నిర్వహించాలని హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు సూచించింది. విద్యాసంస్థల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాలను సంబంధిత ఏఎన్‌ఎంలు హెల్త్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.  


భారత ప్రభుత్వం 2007-08 ఏడాది 11వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని (NTCP) ప్రారంభించింది. 21 రాష్ట్రాలలో 42 జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం అమలుచేస్తున్నారు. 


 


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు


Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్... నేటి నుంచి పది రోజుల పాటు