టాలీవుడ్ టాప్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పరేషాన్’.  ‘ఘాజీ’, ‘మల్లేశం’, ‘జార్జిరెడ్డి’, ‘పలాస’,‘మసూద’ లాంటి చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నతిరువీర్.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసలో ఫుల్ ఫన్ తో అందరినీ అలరిస్తోంది. ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సైతం అందిరనీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ సినిమాను రానా సమర్పిస్తున్నట్లు ప్రకటించినప్పుడే ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి.   


రానాకు కల్లు దావత్ ఇచ్చిర గంగవ్వ


టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుతో ‘కొబ్బరి మట్ట’ లాంటి ఫన్నీ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అందుకున్న దర్శకుడు రూపక్‌ రోనాల్డ్‌ సన్‌ ‘పరేషాన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పావని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ అయ్యింది. అందులో భాగంగానే ‘పరేషాన్’ టీమ్ ‘మై విలేజ్ షో’ టీమ్ తో కలిసి సందడి చేసింది. రానాకు గంగవ్వ కల్లు దావత్ ఇచ్చింది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మై విలేజ్ షో టీమ్ రిలీజ్ చేసింది.






‘మై విలేజ్‌ షో’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ


తెలంగాణ యాసలో చక్కటి  వీడియోలు చేస్తూ  మంచి గుర్తింపు తెచ్చుకుంది ‘మై విలేజ్‌ షో’ యూట్యూబ్ చానెల్. ఈ చానెల్ ద్వారా పాపులారిటీ సంపాదించి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. తక్కువ రోజులు హౌస్ లో ఉన్నా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు, బుల్లితెరపైనా అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తోంది గంగవ్వ. తాజాగా ‘పరేషాన్’ ప్రమోషన్ లో భాగంగా రానా, తన మూవీ టీమ్ తో గంగవ్వను కలిశారు. మై విలేజ్ షో టీమ్ తో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా రానాకు గంగవ్వ కల్లు దావత్ ఇచ్చింది. కల్లు తాగిన తర్వాత రానా  ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మ విలేజ్ షో ఫుల్ వీడియో వచ్చే వరకు ఆగాల్సిందే! ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.   



Read Also: కమెడియన్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు - మంచు విష్ణు ట్వీట్ వైరల్