‘‘మా అమ్మాయి సితార తెలుగు సినిమాలు చేయనంది. ఇంగ్లీష్ సినిమాల్లో చేయడమంటేనే తనకు ఇష్టమంది’’ అని సూపర్ మహేష్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన ఓ సంస్థ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘మీ కూతురు సితార సినిమాల్లో చేస్తుందా? మీరు ఆమెతో కలిసి నటించేయడానికి సిద్ధమేనా?’’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేను నా కూతురితో పనిచేయాలంటే ఇబ్బంది(నెర్వస్)గా ఫీలవుతా. ఆమె ఇంగ్లీష్ సినిమాలు చేస్తానని అంటుంది. ఈ విషయాన్ని ఆమె జోక్‌గా చెప్పింది. సితార ఇంకా చిన్నపిల్ల. ఆ ఏజ్‌లో ఆలోచనలు అలాగే ఉంటాయి. ‘ఫ్రోజెన్’ సినిమాకు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆమెకు ఆ ఆసక్తి పెరిగింది. ఆ ప్రభావం వల్ల ఆమెకు ఇంగ్లీష్ సినిమాలపై ఆసక్తి పెరిగింది. మన పిల్లల మీద ఏదీ ఫోర్స్ చేయకూడదు. నిర్ణయం వారికే వదిలేయాలి’’ అని మహేష్ బాబు తెలిపారు.
Also Read: ఆ ప్యానెల్‌లో నటులు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు.. వాళ్లు పనిచేయలేరు: మంచు విష్ణు
త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలపై త్వరలోనే ప్రకటన: దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా ఈ ఏడాదిలోనే ఉండవచ్చని మహేష్ బాబు అన్నారు. రాజమౌళితో సినిమా గురించి స్పందిస్తూ.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని, ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నా అని తెలిపారు. తనకు తండ్రి కృష్ణ నటించిన ‘అల్లురి సీతారామరాజు’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ బాబు తెలిపారు. ఇప్పట్లో వెబ్‌సీరిస్ చేసే ఆలోచన లేదని మహేష్ బాబు అన్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా ‘పోకిరి’ స్థాయిలో హిట్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
నేను మొబైల్ ఎక్కువ ఉపయోగించను: ‘‘నేను మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించను. నా పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు ఫోన్ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు క్లాసులన్నీ ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల పిల్లలకు ఫోన్ ఇవ్వక తప్పడం లేదు. అలాగని పిల్లలకు ఫోన్ ఇవ్వాలని ప్రోత్సహించడం లేదు’’ అని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఇప్పటికే దుబాయ్, గోవాలో షూటింగ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో స్పెయిన్‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది.
Also Read: జీవిత ప్రలోభ పెడుతోంది.. కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు, హీటెక్కిన ‘మా’ ఎన్నికలు