ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రల సీఎంల సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. అలాగే అమిత్ షాతో విడిగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఖరారు అయితే 27 ఉదయం తిరుగు పయనం అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Also Read : పరిషత్ పీఠాల కోసం రచ్చ రచ్చ - పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ ఆందోళన ! 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారమే ఈ సమావేశం కోసం ఢిల్లీ చేరుకున్నారు. 26వ తేదీన ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను హోంశాఖ మంత్రి సమీక్షించనున్నారు. 


Also Read : ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా... తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి... రాయలసీమ తెలంగాణలో ఉంటే బాగుండేదని ఆసక్తికర వ్యాఖ్యలు
  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ వెళ్లి జల వివాదాలపై కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు ప్రధాని, హోంమంత్రులతో కూడా మాట్లాడాలని అనుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఢిల్లీ నేతల అపాయింట్‌మెంట్లు కోరినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి అలాంటి అపాయింట్‌మెంట్‌లు ఏవీ ఖరారు కాలేదు. అయితే నేరుగా అమిత్ షాతోనే సమావేశం జరుగుతోంది కాబట్టి ఆయన హాజరవుతున్నారు. అలాగే విడిగా సమావేశం అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరారు. 


Watch Video : జేసీ Vs కేతిరెడ్డి.. దశాబ్దాల తా'ఢీ'పత్రి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?


ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లినా ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశం లేదు .. కానీ హోంమంత్రితో పాటు కీలకమైన ఇతర నేతల్ని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు.. నిధులపై మంత్రుల్ని కలవడానికి చాన్స్ ఉంది. ఒక వేళ ఎవరి అపాయింట్‌మెంట్లు లభించకపోతే విజ్ఞాన్ భవన్‌లో సమావేశం ముగిసిన తర్వాత వెంటనే తాడేపల్లికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. 


Also Read : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి