ఆనంద్ రవి (Anand Ravi) కథానాయకుడిగా నటించిన  చిత్రం 'కోరమీను' . ఏ స్టోరీ ఆఫ్ ఈగోస్... అనేది ఉపశీర్షిక. డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. 2022కు వీడ్కోలు పలుకుతూ... 2023కి స్వాగతం చెప్పే తెలుగు సినిమాల్లో ఇదొకటి. ఇందులో 'మీనాచ్చి... మీనాచ్చి...' పాటను తాజాగా విడుదల చేశారు.
 
ఒక్కసారి వింటేమళ్ళీ మళ్ళీ వినాలనేలా...
'మీనాచ్చి మీనాచ్చి...
నిన్నే చూడ‌గా.. ఓ.. ఓ!
మ‌న‌సిచ్చి మ‌న‌సిచ్చి...
న‌చ్చా నిన్నుగా.. ఓ.. ఓ!
క‌ల‌గా వ‌చ్చేశావు క‌ళ్ల‌కెదురుగా...
అల‌వై లాగావు నన్ను పూర్తిగా!
కడలై పొంగాను ఒక్కసారిగా...
తెలియలేదులే గగనమే తగిలెనే!''
అంటూ సాగిన ఈ జీతాన్ని పూర్ణాచారి రాశారు. విశాఖ సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో కథ సాగుతుంది. పూర్ణాచారి సాహిత్యంలో ఆ సముద్రపు సొగసు కనిపించింది. పాటను సూరజ్ సంతోష్ ఆ ఫీల్ వినిపించేలా పాడగా... అనంత నారాయణన్ ఏజీ వినసొంపైన బాణీ అందించారు. మళ్ళీ మళ్ళీ వినాలపించేలా సాంగ్ ఉంది. కథానాయికపై కథానాయకుడి ఉన్న సముద్రమంత ప్రేమను ఈ పాటలో ఆవిష్కరించారు.

  
ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మ‌హేశ్వ‌ర్ రెడ్డి  భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రకటనకు ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని 'కోరమీను' ఆకర్షిస్తోంది. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అనే పోస్టర్‌తో వినూత్నంగా ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.


Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
  


'కోరమీను' టీజర్ చూస్తే నటుడు శత్రు మీసాల రాజు అనేది ఈజీగా అర్థమవుతుంది. జాలరి పేటకు కొత్తగా పోలీస్ రావడం, జాయిన్ అయిన రోజున ఆయన మీసాలను ఎవరో తీసేయడం, ఆ కోపంతో రగిలే ఆయన తన మీసాలు ఎవరు తీశారో తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం... కథలో కీలకమైన అంశం అని తెలుస్తోంది. 


'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ... అసలైన పవర్ భయానిదే రా' అని హరీష్ ఉత్తమన్ (Harish Uthaman) నోటి నుంచి వచ్చే మాట... ఆయన పాత్ర ఏమిటన్నది చెప్పకనే చెప్పింది. 'ఇది జాలరి పేట... డబ్బున్నోడు, డబ్బు లేనోడు అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి మాట చెబుతారు. డబ్బున్న వాళ్ళది రాజ్యమనే మీనింగ్ అందులో వినబడుతోంది.


కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని, నిర్మాణ సంస్థ : ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ - కథనం - మాటలు : ఆనంద్ రవి, దర్శకత్వం : శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.


Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?