మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు విజయ సాధించారు. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్‌పై వందకి పైగా ఓట్ల ఆధిక్యంతో విష్ణు గెలుపొందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. భావోద్వేగంతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. ఇంత దూరం వచ్చి ఉండకూడదని అన్నారు. రెండు నెలలు నరకం చూశామని.. ఒకరితో మరొకరం మాట్లాడుకోలేదని అన్నారు. అందరం కలిసి పని చేస్తామని వాగ్దానం చేశారు. 

 


 

మా మసక బారలేదని.. కష్టపడి పని చేసేవారికి ఫలితం దక్కిందని నరేష్ అన్నారు. 'ఎప్పుడొచ్చామా అని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..?' అంటూ మహేష్ బాబు డైలాగ్స్ చెప్పారు. 

 

ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, హేమ గెలుపొందగా.. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు విజయం సాధించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం సాధించారు. విష్ణు ప్యానల్‌కు చెందిన అభ్యర్థి బాబు మోహన్‌పై శ్రీకాంత్ గెలుపొందారు. మా ఎన్నికల్లో ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేసిన శివ బాలాజీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి నాగినీడుపై గెలుపొందారు.

 





Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి