MAA Elections: వాట్ అమ్మా..? వాట్ ఈజ్ దిస్ అమ్మా..? విష్ణు-ప్రకాష్ రాజ్ సెల్ఫీపై హీరో సెటైర్   

మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరూ నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న ఫోటో బయటకొచ్చింది. దీనిపై ఓ హీరో సెటైర్ వేశారు.

Continues below advertisement

ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన 'మా' ఎన్నికల పోలింగ్ 3 గంటలకు పూర్తయింది. ఎన్నడూ లేని విధంగా 'మా' ఎన్నికలు పోటీపోటీగా సాగాయి. పోలింగ్ మొదలుకావడానికి కొన్ని గంటల ముందుకు కూడా రెండు ప్యానెల్స్ వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వీడియోలను విడుదల చేశారు. దీంతో పోలింగ్ ఎలాంటి వాతావరణంలో జరుగుతుందోనని సందేహాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే కొన్ని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివబాలాజీ, సమీర్ గొడవ పడడం, హేమ వెళ్లి శివబాలాజీ చేయి కొరకడం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 

Continues below advertisement

Also Read: ప్రగ్యా జైస్వాల్‌కు మళ్లీ కరోనా.. టెన్షన్ లో బాలయ్య

పోలింగ్ జరుగుతున్న కేంద్రం వద్దకు చేరుకున్న మంచు విష్ణు-ప్రకాష్ రాజు ఒకరినొకరు పలకరించుకోవడం, మోహన్ బాబుని చూడగానే ప్రకాష్ రాజ్ వెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టే ప్రయత్నం చేయడం.. దాన్ని అడ్డుకొని మోహన్  హగ్ చేసుకోవడం, విష్ణుతో చేతులు కలిపించడం లాంటివి జరిగాయి. ఇదే సమయంలో మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరూ నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న ఫోటో బయటకొచ్చింది.

ఇది చూసిన మంచు విష్ణు తమ్ముడు, నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ.. 'వాట్ అమ్మా..? వాట్ ఈజ్ దిస్ అమ్మా..?' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'రాజకీయం వేరూ.. సినిమాలు వేరూ... మీకు తెల్వదూ... తరువాత ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేయాలి' అంటూ ఓ నెటిజన్ 'ఇద్దరు మంచి నటులు అని అర్థం అయితుంది... కడుపులో ఎంత కుళ్ళు ఉన్న బయట పడడం లేదు...' అంటూ మరో నెటిజన్ ఇలా ఒక్కొక్కరూ తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్

Also Read ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!

Also Read:  ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్

Also Read: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement