విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'జిన్నా' (Ginna Movie). కొందరు విమర్శకులు, తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా... ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు చేసినా... థియేటర్ల దగ్గర ఆశించిన రీతిలో ప్రేక్షకుల సందడి కనిపించలేదు. నాలుగు సినిమాల మధ్య విడుదల కావడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు. అయితే... 'జిన్నా'తో విష్ణు మంచుకు లాభమే అని ఓ టాక్ వినబడుతోంది. 


హిందీ డబ్బింగ్ రైట్స్‌కు 10 కోట్లు!
'జిన్నా' కంటే ముందు విడుదల అయిన మంచు విష్ణు సినిమాలు కొన్ని హిందీలో డబ్బింగ్ అయ్యాయి. మంచి వ్యూస్ సొంతం చేసుకున్నాయి. దానికి తోడు హిందీ ప్రేక్షకులకు బాగా తెలిసిన సన్నీ లియోన్ 'జిన్నా'లో ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ కూడా గతంలో హిందీ సీరియల్ చేశారు. దాంతో 'జిన్నా' హిందీ డబ్బింగ్ రైట్స్‌కు పది కోట్ల రూపాయలు వచ్చాయని ఇండస్ట్రీ టాక్.
  
'జిన్నా' థియేటర్లలో విడుదల అయ్యే సరికి పదిహేను, పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని సమాచారం. మూవీ బడ్జెట్ 15 కోట్లు అనుకున్నా... పది కోట్ల రూపాయలు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా వచ్చేశాయి. డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్స్, ఆడియో రైట్స్ వగైరా వగైరా కలుపుకొంటే బడ్జెట్ రికవరీ అవుతుందని తెలుస్తోంది. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారా ఎక్కువ లాభం వచ్చిందట. 


ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు సినిమా?
Prabhu Deva To Direct Manchu Vishnu : 'జిన్నా' తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'ఢీ'కి సీక్వెల్... 'ఢీ అంటే ఢీ' చేయనున్నట్లు విష్ణు మంచు అనౌన్స్ చేశారు. అది కాకుండా ప్రభు దేవా దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'జిన్నా'లో 'గోలి సోడా' పాటకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సినిమా డిస్కషన్ వచ్చిందని, విష్ణు మంచుకు సరిపోయే కథ ప్రభు దేవా దగ్గర ఉందని, త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్.  


Also Read : ప్రభాస్ 'సాహో'లో సీన్స్ కాపీ చేసిన షారుఖ్ 'పఠాన్'?


స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించిన 'జిన్నా' సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, 'వెన్నెల' కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా - వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు మంచు. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా స్నేహం నేపథ్యంలో వచ్చే పాట పాడారు.