ట్విట్టర్‌లో 'సాహో' (Saaho) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ (Prabhas) బర్త్ డే పది రోజుల క్రితం జరిగింది. సినిమా విడుదల తేదీ కూడా ఇప్పుడు లేదు. ఆగస్టు 30 'సాహో' రిలీజ్ డేట్! మరి, ఉన్నట్టుండి ట్విట్టర్‌లో 'సాహో' ఎందుకు ట్రెండ్ అవుతోంది? ఏంటి? అంటే... షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన 'పఠాన్' టీజర్ విడుదల కావడమే!


'పఠాన్'లో కొత్తగా ఏముంది?
'పఠాన్' టీజర్ (Pathaan Teaser) విడుదలైన తర్వాత నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సీన్స్‌లో కొత్తగా ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. 'పఠాన్'కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీని కంటే ముందు ఆయన 'వార్' తీశారు. ఆ సినిమాలో సీన్స్ మళ్ళీ సిద్ధార్థ్ ఆనంద్ రిపీట్ చేశారని చెబుతున్నారు. షారుఖ్, దీపికా పదుకోన్‌పై చిత్రీకరించిన సాంగ్ విజువల్స్ చూస్తే... 'వార్'లో హృతిక్ రోషన్, వాణీ కపూర్‌పై  చిత్రీకటించిన సాంగ్ విజువల్స్ సేమ్ ఉన్నాయని స్క్రీన్ షాట్స్ తీసి మారి చూపిస్తున్నారు. మంచుకొండల్లో తీసిన ఫైట్స్ కూడా 'వార్'లో ఉన్నట్టు ఉన్నాయని అంటున్నారు. 
    
జెట్ ప్యాక్ సీన్ 'సాహో'లో ఉందిగా!
'పఠాన్' టీజర్‌లో సాంగ్స్, ఫైట్స్ విజువల్ పక్కన పెడితే... ఒక్కటంటే ఒక్క విజువల్ మాత్రం 'సాహో'ను గుర్తు చేసింది. అదే జెట్ ప్యాక్ ఫైట్ విజువల్! 'పఠాన్' టీజర్ చివర్లో ఆ సీన్ వచ్చింది. సేమ్ టు సేమ్ అటువంటి సీన్ 'సాహో'లో ఉంది. 'పఠాన్' టీజర్‌లో కంటే 'సాహో'లో సీన్ చాలా బావుంటుందని... 'పఠాన్' టీజర్ చూసిన తర్వాత 'సాహో' గొప్పతనం తెలిసిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలా ఆ సినిమా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. 


నిజం చెప్పాలంటే... తెలుగులో 'సాహో'కు పెద్దగా వసూళ్లు, ప్రశంసలు రాలేదు. కానీ, హిందీలో సినిమా బాగా ఆడింది. అక్కడ వంద కోట్లకు పైగా షేర్ రాబట్టింది. నార్త్ ఇండియాలో ప్రేక్షకులు సినిమాను బాగా చూశారు. 'సాహో' చూసిన కళ్ళకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' నచ్చుతుందో? లేదో? చూడాలి.   


షారుఖ్ పుట్టినరోజు కానుకగా విడుదల అయిన 'పఠాన్' టీజర్ ఆయన అభిమానులకు నచ్చి ఉండొచ్చు. కానీ, మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. దీనికి తోడు ఖాన్ హీరోలు అంటే కొంత మంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న 'పఠాన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు తిరిగొచ్చిన 'సుడిగాలి' సుధీర్?