తులసి పొద్దున్నే నిద్రలేవకపోవడం చూసి ప్రేమ్ సంతోషిస్తాడు. తులసిని నిద్ర లేపడానికి పరంధామయ్యలా గొంతు మార్చి మాట్లాడి నిద్రలేపుతాడు. ఒక్కసారిగా తులసి నిద్ర లేచి గది నుంచి బయటకి పరుగులు పెడుతుంది. వచ్చి చూసేసరికి ప్రేమ్ వాయిస్ మార్చి మాట్లాడటంతో తన చెవి మెలిపెడుతుంది. అటు ఇంట్లో పరంధామయ్య కిచెన్లోకి వచ్చి టీ పెట్టుకుంటుంటే అనసూయ వచ్చి నేను పెడతాను అని అంటుంది. కానీ పరంధామయ్య మాత్రం తనని వద్దని పక్కకి జరుగుతాడు. తులసి వెళ్తు వెళ్తు మిమ్మల్ని కూడా తీసుకెళ్లింది, నన్ను పట్టించుకోవడం లేదు, 50 సంవత్సరాలు కాపురం చేసిన భార్య మీకు శత్రువు అయిపోయింది కేవలం ఆ తులసి వల్ల. తప్పు చేసింది తనైతే నన్ను దోషిగా చూస్తున్నారు అని అనసూయ మాట్లాడుతూనే ఉంటుంది.


పరంధామయ్య: తప్పు చేసింది నువ్వో నేనో కాదు ఆ దేవుడే తులసి జీవితంలోకి 26 ఏళ్ల క్రితమే సామ్రాట్ ని భర్తగా పరిచయం చేసి ఉండాల్సింది. తులసికి భర్తగా సామ్రాట్ లాంటి వ్యక్తి సరైన వాడు నందగోపాల్ లాంటి వాడు కాదు


Also read: ఊహించని ట్విస్ట్, ఒకేసారి రెండు నిజాలు బట్టబయలు- ఫుల్ ఖుషిలో దేవి, షాకైన చిన్మయి


తులసి తులసి కోటకి పూజ చేస్తూ తన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అంకిత కిచెన్లో వంట చేస్తుంటే అభి వచ్చి టిఫిన్ పెట్టమని అడుగుతాడు. టైమ్  పడుతుందని అంకిత అనేసరికి నేనేమైనా ఖాళీగా కూర్చున్నాన అని అంటాడు. దీంతో కోపంగా అంకిత అసలు నేను టిఫిన్ వండను అని బయటకి వస్తుంది. ఇద్దరి మధ్య తులసి గురించి కాసేపు వాదులాట జరుగుతుంది. మామ్ చేసింది తప్పని నాకు అనిపించింది, ప్రేమ చంపుకుని దూరంగా ఉండటానికి అది ఒక కారణం అని అభి చెప్తాడు. నువ్వు చేసింది తప్పని నాకు అనిపించింది నేను కూడా దూరంగా ఉండనా అని అంకిత అంటుంది. తులసి ఇల్లు వదిలివెళ్లిపోవడం ఏమో కానీ ఈ పనులు చెయ్యలేకచస్తున్నా అని అనసూయ తిట్టుకుంటుంది. లాస్య వచ్చి మీతో అర్జెంట్ గా మాట్లాడాలి అని అంటుంటే అనసూయ చిరాకుగా ఉంటుంది.


లాస్య: పేరుకు తులసి ఇల్లు వదిలి వెళ్ళింది కానీ మనం తన ఇంట్లోనే ఉంటున్నాం. తను తలుచుకుందంటే మనం రోడ్డు మీద పడతాం. మనం ఎలాగైనా తులసి, సామ్రాట్ నుంచి ఇల్లు కాపాడుకోవాలి.


అనసూయ: వాడు ఏంటి చేసేది. ఈ ఇల్లు మీ మావయ్యది


లాస్య: కానీ అది సామ్రాట్ ప్రేయసి పేరు మీద ఉంది, ఇంటిని అడ్డం పెట్టుకుని తులసి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు కాలనీలో మనం తలెత్తుకుని తిరగలేము


అనసూయ: ఇప్పుడు ఏం చేద్దాం


లాస్య: ఈ ఇంటిని తులసి నుంచి లాగేసుకోవాలి


Also Read: మల్లెపూలు చూసి మురిసిన వేద- యష్ ని ఇరకాటంలో పెట్టిన ఆదిత్య


ఏం చెయ్యాలో నాకు తెలుసని అనసూయ అంటుంది. తులసి ఆఫీసుకి వెళ్లేందుకు హడావుడి చేస్తుంది. ఇల్లు అద్దెకి వెతకడానికి ఎప్పుడు వెళ్దామని ప్రేమ్ తులసిని అడుగుతాడు. అదేంటి కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సిందే అని దీపక్ తో పాటు తులసి తల్లి కూడా బతిమలాడుతుంది. తులసి సరే అనేసరికి దీపక్ సంతోషపడతాడు. అనసూయ ఇంటి బయట కూరగాయలు కొనేందుకు వస్తుంది. అక్కడకి వచ్చిన అమ్మలక్కలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. తులసి ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ ఇంటికా లేదంటే బి ఫ్రెండ్ ఇంటికా అని వాగుతారు. ఆ మాటలకి అనసూయ రగిలిపోతుంది.