రుక్మిణి గుడికి వెళ్లేందుకు రెడీ అవుతుంటే చాటు నుంచి దేవి చూస్తూ సంతోషిస్తుంది. తన ప్లాన్ ఫలిస్తుందని ఆనందంగా ఉంటుంది. అమ్మకి నాయన అంటే మస్త్ ఇష్టం అనుకుంటా, అందుకే నాయన దగ్గరకి వెళ్ళడానికి మంచిగా రెడీ అవుతుందని దేవి మనసులో అనుకుంటుంది. నీ దగ్గరకి అమ్మే కాదు నేను కూడా వస్తున్నా ఈ పొద్దు నువ్వు ఎవరో నాకు తెలిసిపోతుందని దేవి రుక్మిణి వెంటే గుడికి వస్తుంది. గుడిలో రుక్మిణి ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దేవి గుడిలో దేవుడి ముందు దణ్ణం పెట్టుకుంటూ ఉంటే ఆదిత్య అక్కడికి వస్తాడు. దేవి దణ్ణం పెట్టుకుని బయటకి వచ్చేసరికి రుక్మిణి గుడి బయట ఉండదు దీంతో తనని వెతుక్కుంటూ వెళ్తుంది.


Also Read: మల్లెపూలు చూసి మురిసిన వేద- యష్ ని ఇరకాటంలో పెట్టిన ఆదిత్య


రుక్మిణి దీపాలు వెలిగిస్తుంటే ఆదిత్య పక్కనే కూర్చుని ఉంటాడు. దేవి వచ్చి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. దీపాలు పెట్టాలి రా అన్నది ఇక్కడ ఆఫీసర్ సర్ తో కలిసి దీపాలు వెలిగిస్తుందంటే ఆఫీసర్ సర్ మా నాయన అని దేవి పిచ్చ ఆనందంగా ఉంటుంది. ఆదిత్యతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుని సంతోషిస్తుంది. మా అమ్మ, నాయన ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండేటట్టు చూడు అని దేవి మళ్ళీ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది. ఆదిత్య, రుక్మిణిని గుడిలో మాధవ్ చూస్తాడు. మీరిక్కడ దీపాలు వెలిగిస్తున్నారా అని మాధవ్ సత్యకి ఫోన్ చేస్తాడు. నా రుక్మిణి, నా బిడ్డ కలిసి ఉండేలా చూడు తల్లి అని ఆదిత్య కోరుకుంటాడు. దేవిని తండ్రి దగ్గరకి చేరేలా చెయ్యమని రుక్మిణి వేడుకుంటుంది.


ఇక్కడ చాలా దారుణం జరుగుతుందని మాధవ్ సత్యకి నూరిపోస్తాడు. ఆదిత్య ఇక్కడ గుడిలో నా రాధతో కలిసి దీపాలు వెలిగిస్తున్నాడు, నా భార్య నీ భర్తతో కలిసి అలా చేస్తుంటే చాలా బాధగా ఉందని అంటాడు. నాకు ఫోన్ చేసే బదులు వాళ్ళని నిలదీయొచ్చు కదా అని సత్య అడుగుతుంది. ఏమడిగేది నలుగురిలో వాళ్ళ పరువు తియ్యలేను, వాళ్ళని ఏమి అనలేక నా బాధ నీతో షేర్ చేసుకున్న అని మంట పెడతాడు. నాయన్ని చూసినందుకు మస్త్ ఖుషిగా ఉంది, కానీ ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని దేవి మనసులో అనుకుంటుంది.


Also read: దేవి ప్లాన్ అదుర్స్, అడ్డంగా బుక్కైన రుక్మిణి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోతుందా?


మాధవ్ ఆదిత్యని సత్య దగ్గర బ్యాడ్ చేస్తున్నందుకు తెగ సంతోషపడుతూ ఉంటాడు. చేతులు కడుక్కోవడానికి మాధవ్ ప్రయత్నిస్తుంటే నీళ్ళు పడి చేతి మీద రాసుకున్న దేవి పేరు చెడిపోవడం చిన్మయి కంట పడుతుంది. అది చూసి చిన్మయి షాక్ అవుతుంది. ‘ఈ పచ్చబొట్టే కదా నా ఆయుధం ఇది చెరిగిపోయిందంటే దేవికి నేను చెప్పకుండానే అంతా అర్థం అయిపోతుంది. రాధ మెడలో తాళి కట్టే వరకి ఈ పేరు నా చేతి మీద నిజమైన పచ్చబొట్టులాగే ఉండాలి అనుకుని స్కెచ్ తీసుకుని దేవి అని మళ్ళీ రాసుకుంటాడు. ఎందుకు రాధ నన్ను ఇంత చెడ్డవాడిగా చేస్తున్నావ్. నువ్వంటే నాకున్న ఇష్టం అని చెప్పాను వినలేదు, దేవికి తండ్రిగా ఉంటే నీకు భర్తగా ఉండలేను అని నేను తండ్రిని కాదని చెప్పేసాను. ఎవరో తండ్రి అని నమ్మించేశాను. కానీ ఆ నాన్న కోసం వెతుకుతూ కళ్ళ ముందు ఉన్న నాన్నని మర్చిపోయేలా చేశాను. నువ్వు దేవికి నాన్న గురించి చెప్పాలంటే వంద ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. నువ్వు నాతో యుద్ధం చేయలేవు చివరికి నాతో కలిసిపోవాల్సిందే. అప్పటివరకు నేను వదిలిపెట్టను’ కదా అని తనలో తనే బయటకి మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ చిన్మయి వింటూ ఉంటుంది.