Horoscope Today 3rd November 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి 
ఈ రోజు మీరు అత్యద్భుతమైన, ఖరీదైన విషయాలకు ఆకర్షితులవుతారు. మీ మనస్సులో పెద్ద ప్రణాళికలు ఉంటే వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. విందు వినోదాలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. ఎంత పని చేసినా అలసటని ఫీలవరు..మీ మనస్సు చురుకుగా ఉంటుంది. 


వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు.  ఆర్థిక పరిస్థితులు బావుంటాయి. అదనపు ఆదాయానికి మార్గాలు కనిపిస్తాయి. కొంతమంది ఇంటికి సంబంధించిన పనులు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేయండి. సృజనాత్మకంగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి.


మిథున రాశి
ఈ రోజు మీ సృజనాత్మక ఆలోచనలతో అబ్బురపరుస్తారు. ఆర్థిక రంగంలో కొన్ని పెట్టుబడుల గురించి అనిశ్చితి ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులు మీ సహనాన్ని పరీక్షిస్తారు..కాబట్టి ప్రతిస్పందించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దేనిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 


Also Read:  పూర్తిగా శివుడిలో ఐక్యం ఐపోవాలంటే ఇక్కడకు వెళ్లాలి!


కర్కాటక రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు.కొత్త అవకాశాలు వస్తాయి..ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. ఓ ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటేనే పూర్తవుతాయని గుర్తించాలి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.


సింహ రాశి 
మీకు అనుకూలమైన రోజు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కనిపిస్తాయి. మీరుతలపెట్టిన కొన్ని కార్యక్రమాల వల్ల తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ కృషికి తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ వ్యక్తిత్వంలో ఇతరులను ఆకర్షిస్తారు


కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ బిజినెస్ అసోసియేట్ లు, బాస్ లు, సహోద్యోగులు లేదా స్నేహితుల వల్ల ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఉద్యోగాలు మార్చడానికి ప్రణాళిక వేసుకునే వారు కొంచెం ఎక్కువ కాలం వేచి ఉండాలి. ఇల్లు లేదా ఆఫీసులో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయడానికి మీ శక్తి మీకు సహాయపడుతుంది.


తులా రాశి 
మీకు మనసుకి దగ్గరైన వారితో టైమ్ స్పెండ్ చేస్తారు. మీ  హార్డ్ వర్క్ మరియు స్థిరమైన ప్రయత్నాలు మీకు ప్రయోజనాలు లేదా ఆర్థిక అవకాశాలను ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రొఫెషనల్ ఫ్రంట్ లో ఎవరైనా మీ మేధో బలాన్ని పరీక్షించవచ్చు. 


Also Read: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు


వృశ్చిక రాశి
మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. సంభాషణకు ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేరు. వ్యాపార రంగంలో మీరు చేసే ప్రతిదానికి ఇది సరైన రోజు. అనవసరమైన పనులపై మీ శక్తిని లేదా సమయాన్ని వృధా చేయవద్దు


ధనుస్సు రాశి 
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో శుభవార్త కోసం ఎదురుచూస్తున్న వారి ఆశ నెరవేరవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఒక ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కొంతమంది అదనపు గంటలు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.


మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలన్నాయి. ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దేశీయంగా కొన్ని సానుకూల కారకాలు మీలో సానుకూలత మరియు శక్తిని నింపవచ్చు. ఉద్యోగులు కొంత ఒత్తిడికి గురవుతారు. కొంతమంది తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు.


కుంభ రాశి
ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకుఇది మంచిరోజు. ఉద్యోగులకు ఫలవంతమైన రోజు. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.  స్ఫూర్తిదాయక పుస్తకాలను చదవండి.


మీన రాశి
వృత్తిపరంగా, కుటుంబపరంగా సాధారణంగా ఉండొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు మీరు ఊహించిన రాబడిని ఇవ్వకపోవచ్చు. మీరు ఆగ్రహంతో కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవద్దు.  మీ భావోద్వేగాలను నియంత్రించండి.  పని విషయంలో చురుకుదనం ప్రదర్శించండి. ఆరోగ్యం జాగ్రత్త.