మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల అంశం రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎత్తులు పై ఎత్తులతో దూసుకుపోతున్నారు. తాజాగా టీచర్స్ డే సందర్భంగా మంచువిష్ణు నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా మా ఎన్నికల వ్యూహంతో ముడిపెడుతున్నారు కొందరు. కరోనా మహమ్మారి సమయంలో సహచరులకి సాయంగా నిలిచిన సినీ కళాకారుల్ని సన్మానించనున్నట్టు తెలిపాడు మంచు విష్ణు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నాడు.  కళాకారుల సేవానిరతిని గౌరవించడమే తమ లక్ష్యం అని అన్నాడు. ‘‘ఉపాధ్యాయ దినోత్సవం అనేది ముఖ్యమైన పండుగ అని  ‘శ్రీ’ విద్యానికేతన్‌ కుటుంబంలో ఉపాధ్యాయ  దినోత్సవం అంతర్భాగం’’ అన్నాడు.


కార్యక్రమం నిర్వహించడం వరకూ సంతోషమే అంటున్న కొందరు దీన్ని మా ఎన్నికల వ్యూహంలో భాగం అన్నారు. ఎందుకంటే విష్ణు సన్మానించిన వారిలో  ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, నిర్మాత రామ సత్యనారాయణ, పృథ్వీ, శివ బాలాజీ, గౌతమ్‌ రాజు, మధుమిత సహా పలువురు కళాకారులున్నారు. అయితే మా ఎన్నికల తేదీ అక్టోబరు 10న ప్రకటించినప్పటి నుంచీ ఎత్తులు, పైఎత్తులు, పార్టీలు, విందులు, గెట్ టుగెదర్లు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు విష్ణు నిర్వహించిన టీచర్స్ డే వేడుకలు కూడా ఇందులో భాగమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ALso Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో


ఇప్పటికే మా అధ్యక్ష పదవికి నలుగురు పోటీచేస్తారని భావించినప్పటికీ… హేమ, జీవితా రాజశేఖర్‌ అనూహ్యంగా ప్రకాశ్‌ రాజ్‌ ‘‘సిని‘మా’ బిడ్డలం’’ ప్యానెల్‌లో చేరడం హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై స్పందించిన జీవిత గత `మా` ఎన్నికల్లో తనతో పాటు గెలిచిన వారంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారని.. వాళ్లు తనని పిలవడమే గాక.. ప్రకాష్ రాజ్ మాట్లాడి ఆహ్వానించడంతో ఆ ప్యానెల్ లోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. బండ్ల గణేష్ తో ఎలాంటి విభేధాలు లేవన్న జీవిత.. తనకి ఇష్టమైన చోట పోటీ చేసే హక్కు  ఉందన్నారు. ఏదేమైనా ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ సారి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్థమవుతుంది. మరి గెలుపెవరిదో చూడాలి.


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్లు మొదలు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?


Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!