మొత్తం 19 మంది సభ్యులతో కలర్ ఫుల్‌‌గా ఉంది బిగ్ బాస్ హౌస్. మొదటి రోజు ఎంట్రీ ఇవ్వగానే పలకరింపులు, హగ్గులతో అబ్బో సందడే సందడి. ఇక సోమవారం వచ్చిందంటే ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలవుతుందనే సంగతి తెలిసిందే. ఓ నాలుగైదు వారాలు గడిస్తే ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. కానీ మొదటి వారం.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతి రోజే నామినేషన్ అంటే ఎవ్వరికైనా కష్టమే. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారిలో అన్ని రంగాల వారు ఉన్నారు. యాంకర్లు, డ్యాన్సర్లు, సింగర్, యాక్టర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా అందరూ ఉన్నారు. హౌస్‌లో పదిమంది మహిళలు ఉ.. తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. మొదటి రోజే బిగ్ బాస్ రకరకాల టాస్కులతో ఇంటి సభ్యులకు చెమటలు పట్టించాడు. ఇక నామినేషన్ల ప్రక్రియతో అసలైన మజా మొదలు కానుంది.


బయటకొచ్చిన లీకులు చూస్తే మొత్తం 19 మందిలో మొత్తం ఆరుగురు నామినేషన్లోకి వచ్చారట. ఇందులో యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ లిస్టు ఫైనల్ అయితే మాత్రం మోడల్‌ హమీదకు మూడినట్టే అంటున్నారు. ఈ ఆరుగురిలో యాంకర్ రవిఃకి ఫాలోయింగ్ బాగానే ఉంది, కోయిలమ్మ సహా పలు సీరియళ్లలో నటించిన మానస్‌కు బుల్లితెర ఫాలోయింగ్ బాగుంది. సరయు గురించి చెప్పడానికేముంది ఆమె హౌజ్‌లో ఉంటేనే కదా హాట్‌నెస్ పెరిగేది. ఇక ఆర్జే కాజల్ గలగల మాటలతో మురిపిస్తోంది. ఓ వర్గం ప్రేక్షకులకు జెస్సీ బాగానే నచ్చాడు. ఇక ఎటొచ్చీ కొత్త ముఖం హమీదనే. అందుకే హమీద మొదటి వారం ఔట్ అని అంటున్నారు.


Also Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో


ఈ వారం ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూసుకుని అసలు ఆట మొదలవుతుంది. ప్రతిసారీ రెండు మూడు గ్రూపులుంటాయి. మరి ఈసారి ఎవరెవరు గ్రూప్ కడతారో.. జంటలుగా అలరించేదవరో చూడాలి. ఏదేమైనా బిగ్ బాస్ రియాల్టీలో చివరి నిముషంలో కూడా చాలా మార్పులుంటాయి. మరి ఈ లెక్కన ఉండేదెవరో మొదటివారం వెళ్లేదెవరో వెయిట్ అండ్ సీ.


Also Read: అలర్ట్..అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!


Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా


Also Read: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!