పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని కొందరంటే..మన బ్రెయిన్ కి పదునుపెట్టడం మానేశామన్న సంగతి మరిచిపోయారా అని మరికొందరంటున్నారు. ఓ రకంగా ఆలోచిస్తే ఇది నిజమే అని ఒప్పుకోవాలేమో. ఈ జనరేషన్ కి ఫోన్లు, మెయిల్స్ బాగా అలవాటయ్యాయి కానీ ఎప్పటి వరకో ఎందుకు కనీసం ముందుతరం వాళ్లలో చాలామందికి వీటిగురించి పెద్దగా తెలియదు. ఇప్పటికీ తెలియని వారున్నారు.  వాళ్లకి ఏం చెప్పినా గుర్తుపెట్టుకునేవారు లేదంటే ఓ పేపర్ పై రాసిపెట్టుకునే వారు. కానీ ఇప్పటి తరం ఏ చిన్న విషయం అయినా అయితే ఫోన్ లేదా మెయిల్స్ లో సేవ్ చేసేస్తున్నారు. ఇదంత సేఫ్ కాదని ఎంతమందికి తెలుసు…


‘దాదాపు 33% మంది భారతీయులు ఇమెయిల్, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ముఖ్యమైన డేటాను భద్రపరుస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. భారతదేశంలోని 393 జిల్లాల నుంచి మొత్తం 24 వేల మంది నుంచి ఈ డేటా సేకరించగా...వారిలో  39 శాతం మంది ముఖ్యమైన సమాచారం ఓ కాగితంపై ఉంచామని, 21 శాతం మంది వాటిని గుర్తుంచుకున్నామని పేర్కొన్నారు. 33 శాతం మంది మాత్రం కంప్యూటర్ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలతో పాటు ఆధార్ కార్డ్ , పాన్ కార్డు లాంటి ఇతర వ్యక్తిగత డేటాను ఇమెయిల్ లేదా వారి ఫోన్లలో భద్రపరుస్తున్నట్టు తేలింది. 


Also Read: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు...ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...


ముఖ్యమైన డేటాను కంప్యూటర్, ఫోన్లలో భధ్రపరచడమే సరైన చర్యకాదంటే మరికొందరైతే ఇలాంటి వివరాలను కుటుంబ సభ్యులు, కార్యాలయంలో సహోద్యోగులతో షేర్ చేసుకుంటున్నారు. వీరిలో 29 శాతం మంది భారతీయులు తమ ATM పిన్, డెబిట్ కార్డ్ పిన్ వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నట్టు తెలిపారు. 4 శాతం మంది అయితే ఏకంగా తమ వివరాలను సహోద్యోగులతో చెబుతున్నారట. 2 శాతం మంది స్నేహితులకు ఈ సమాచారం ఇచ్చేస్తున్నారు. మిగిలిన వారంతా ATM, డెబిట్ కార్డ్ వివరాలను ఫోన్లు, ఈమెయిల్స్ లో పొందుపరుస్తున్నట్టు తేలింది.


Alos Read: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…వ్యక్తిగత కక్షలే అని అనుమానిస్తున్న పోలీసులు


డేటాను ఎవరెక్కడ భద్రపరుస్తున్నారంటే..


కేవలం ఫోన్లలో ముఖ్యమైన సమాచారం భద్రపరుస్తున్న వారు 7%


కేవలం ఈమెయిల్స్ లో ముఖ్యమైన సమాచారం భద్రపరుస్తున్నవారు 15%


ఫోన్లు, ఈమెయిల్స్ లో పిన్ నంబర్లు పెడుతున్న వారు 11%


ముఖ్యమైన సమాచారం పేపర్లు, పుస్తకాల్లో రాస్తున్నవారు 39%


ఏటీఎం పిన్ నంబర్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు గుర్తు పెట్టుకునే వారు 21%


ఈ విషయంపై స్పందించని వారు 7%


వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఎలా ఉంచుకోవాలో అవగాహన కల్పించేందుకు  అవసరమైన కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ ఫలితాలను ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా


Also Read: ఈ ఐదు రాశులవారికి భలేమంచి రోజు… ఆ మూడు రాశుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి


Also Read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..