గత కొన్ని రోజుల పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక తాజాగా సోమవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. తెలంగాణలో స్వల్పంగా తగ్గితే, ఏపీలో కొన్ని చోట్ల మాత్రం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించింది. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 


తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 


తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.43గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.84గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.27గా ఉండగా,  డీజిల్ ధర రూ. 96.68గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.36గా ఉండగా డీజిల్ ధర రూ.97.72గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.74, డీజిల్ ధర రూ.97.14గా ఉంది. 


Also Read:  Weather Report: అలర్ట్..అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!


ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 


విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.41, లీటర్ డీజిల్ ధర రూ.98.32 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.22 ఉండగా డీజిల్ ధర రూ. 97.19 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.50గా ఉండగా డీజిల్ ధర రూ.98.43గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.41, డీజిల్ రూ.98.32 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.107.92, డీజిల్ ధర రూ.98.77 వద్ద ఉంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో


దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12 ఉండగా డీజిల్ ధర రూ.93.40లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. 


Also Read: Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు...ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...