తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీకి అదనంగా మరో బయో ఫార్మాస్యూటికల్‌ హబ్‌ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్ లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. లక్ష చదరపు అడుగుల్లో దీని నిర్మాణం చేపడతామని తెలిపారు. రెండు దశలుగా పనులు ఉంటాయని పేర్కొన్నారు. మరో 15 నెలల్లో బి-హబ్‌ బయో ఫార్మాస్పేస్‌ అందుబాటులోకి రానుందని మంత్రి చెప్పారు. టీఎస్‌ ఐఐటీ, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో దీనిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బయోఫార్మా హబ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని వెల్లడించారు.










Also Read: Bigg Boss Telugu Season 5 Live: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లైవ్ అప్‌డేట్స్.. 13వ కంటెస్టెంట్‌గా ‘7 ఆర్ట్స్’ సరయు బోల్డ్ ఎంట్రీ


Also Read: IND vs ENG, 2nd Innings Highlights: టీమ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 466 ఆలౌట్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 368