ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో టీమ్​ఇండియాకు భారీ ఆధిక్యం లభించింది. పంత్, శార్దుల్ అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 466 పరుగులు చేసింది భారత్. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో పంత్‌ (50), శార్దూల్‌ ఠాకూర్‌ (60) అద్భుత బ్యాటింగ్‌కు తోడు టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌ (25), బుమ్రా (24) రాణించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడమే కాకుండా ఇంగ్లాండ్‌ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (17) నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు.


 


ఆదివారం 270/3 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 196 పరుగులు జోడించి.. మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(44), రవీంద్ర జడేజా(17), నిలకడగా ఆడి నాలుగో వికెట్ కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. అయితే, క్రిస్ వోక్స్ స్వల్ప వ్యవధిలో భారత్ ను గట్టి దెబ్బ పడింది


తొలుత జడేజాను వికెట్ల ముందు దొరకబచ్చుకున్న అతడు కాసేటికే రహానే(0)ను సైతం అదే విధంగా ఔట్ చేశాడు. దాంతో భారత్ 296  పరుగుల వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరోవైపు నిలకడగా ఆడిన కోహ్లీ అర్ధశతకానికి ముందు మెుయిన్ అలీ బౌలింగ్ లో స్లిప్ లో ఓవర్టన్ చేతికి చిక్కాడు. ఆపై పంత్, శార్దూల్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 329/6గా నమోదైంది.



ఇక రెండో సెషన్ లో ధాటిగా ఆడిన ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. వేగంగా పరుగులు తీస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు సాధించి... వరుస ఓవర్లలో ఔటయ్యారు. తొలుత రూట్ బౌలింగ్ శార్దూల్ స్లిపల్ లో ఓవర్టన్ కు దొరికిపోగా.. తర్వాతి ఓవర్ లోనే మెుయిన్ అలీ బౌలింగ్ లో అర్ధశతకం సాధించిన పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


క్రీజులో వచ్చిన ఉమేశ్ యాదవ్, బుమ్రా మరో వికెట్ పడకుండా రెండో సెషన్ పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 445/5గా ఉంది. ఇక మూడో సెషన్ ప్రారంభమైన కాసేపటికే.. ఇద్దరూ ఔటయ్యారు. దాంతో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ మూడు, మెుయిన్ అలీ రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, ఓవర్టన్, రూట్ చేరో వికెట్ తీశారు.