విరాట్ కోహ్లీని రన్ మిషిన్, కింగ్ కోహ్లీ.. ఇలా టీమిండియా ఫ్యాన్స్ ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. అయితే కింగ్ కోహ్లీ ఇటీవల పరుగుల బాటలో వెనుకబడ్డాడు. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క శతకం కూడా కొట్టకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇంగ్లాండ్-భారత్ నాలుగో టెస్ట్ లో కోహ్లీలోనూ ఈ అసహనం కనిపించింది.
డే-4 లంచ్ సెషన్ లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అయితే ఆ టైమ్ లో విరాట్ ఔటడంతో స్టేడియంతో పాటు టీవీ ముందు కూర్చొన్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లే టైంలో కోహ్లీ అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ను చేతితో బలంగా కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు కమా బ్యాక్ స్ట్రాంగ్ కోహ్లీ అని ట్వీట్ చేస్తున్నారు.
కోహ్లీ రికార్డ్..
కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఓవల్ టెస్ట్ 4వ రోజు ఆటలో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
తన 210వ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డ్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు ఈ రన్ మిషన్.