జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఈరోజు​ ప్రదానం చేశారు. 44 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డును అందించారు. సరికొత్త బోధనా పద్దతులతో పిల్లల భవిష్యత్తును నిర్మించిన వారిని ఉత్తమ గురువులుగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణను రామ్ నాథ్ కోవింద్ కీర్తించారు.














విద్యావేత్తగా, తత్వవేత్తగా ప్రపంచం మొత్తానికి డా. రాధాకృష్ణ పేరు తెలుసు. కానీ ఆయన మాత్రం అందరూ తనని ఓ ఉపాధ్యాయుడిగా గుర్తుపెట్టుకోవాలనుకున్నారు. ఓ గొప్ప ఉపాధ్యాయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు.


                                     రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి


శిక్షక్ పర్వ్ పేరుతో ఈరోజు నుంచి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఈ కర్యాక్రమాన్ని జరపనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 44 మంది టీచర్లకు సంబంధించిన డాక్యుమెంటరీలను కూడా ఇందులో చూపిస్తారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు.