సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు (66) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. హృదయ సంబంధిత వ్యాధితో (కరోనరీ సిండ్రోమ్) బాధపడుతోన్న కేశవ్.. ఈ రోజు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఒక పక్క దేశమంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటోన్న వేళ ఆయన మనవడు కన్నుమూయడంతో విషాదం సంతరించుకుంది. 


పదవీ విరమణ తర్వాత కేశవ్.. ప్రజారోగ్యంపై దృష్టి సారించారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, సమాజ ఆరోగ్యం వంటి సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకునేవారు. 2016లో వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ బిల్ వెనక కేశవ్ కీలక పాత్ర పోషించారు. 


ఆయన పలు పుస్తకాలకు రచయితగా.. మరికొన్నింటికి సహ రచయితగా వ్యవహరించారు. లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం గురించి “గిఫ్టెడ్ వాయిస్: ద లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి” అనే పుస్తకం రాశారు. భారత వైద్య రంగంలో ఉన్న అవినీతి గురించి సమిటన్ నండీ, సంజయ్ నాగ్రాల్‌లతో కలిసి 2018లో "హీలర్స్ ఆర్ ప్రీడేటర్స్? హెల్త్ కేర్ కరప్షన్ ఇన్ ఇండియా" పుస్తకాన్ని కేశవ్ రాశారు. 


ప్రముఖుల నివాళులు.. 
కేశవ్ దేశిరాజు మృతి పట్ల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ జైరామ్ రమేశ్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కేశవ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ట్వీట్..






జైరామ్ రమేశ్ ట్వీట్..





Also Read: National Teachers Day 2021: దేశం గర్వించిన తెలుగు వ్యక్తి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్... తెలుగు నాడుతో విడదీయలేని బంధం