Bigg Boss Telugu Season 5 Live: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లైవ్ అప్‌డేట్స్.. 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి.. కథ వేరే ఉంటదట!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మరికొన్ని నిమిషాలు మొదలువుతుంది. హోస్ట్ నాగార్జున ముందుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వెళ్తారు.
‘సింగిల్ బెడ్’ టాస్క్ కోసం ‘రోల్ బేబీ రోల్’ టాస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో మానస్ విజేతగా నిలిచాడు. చివరి టాస్కులో నాలుగు బాక్సులు పెట్టారు. అందులోని ఒక బాక్సులో సింగిల్ బెడ్‌కు వేసిన తాళాన్ని తెరిచేందుకు కీని పెట్టారు. విశ్వ తీసుకున్న బాక్సులో ఆ కీ ఉండటంతో విశ్వకు సింగిల్ బెడ్ లభించింది. దీంతో చివరి టాస్క్ పూర్తయ్యింది.
హౌస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ‘‘నీకు పెళ్లయ్యిందని నాకు తెలీదు. నాకు కూడా చెప్పలేదు. పెళ్లిలా ఇంకా ఎన్ని సీక్రెట్లు దాచి పెట్టావు?’’ అని అడిగారు. ‘‘హౌస్‌లో రియల్‌గా ఉండాలని అనుకుంటున్నా’’ అని రవి ఈ సందర్భంగా తెలిపాడు. నాగ్ సర్‌ప్రైజ్‌గా రవి కుమార్తె పంపిన గ్రీటింగ్‌ను ఇచ్చారు. పాప వాయిస్ మెసేజ్‌ను స్టేజ్ మీద వినిపించారు. దీంతో రవి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం రవి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు.
హౌస్‌లోకి 18వ కంటెస్టెంట్‌గా సినీ నటి శ్వేతా వర్మ అడుగు పెట్టింది. ‘బాహుబలి’ సినిమాలోని ‘‘ధీవరా..’’ పాటతో స్టేజ్ మీదకు వచ్చింది. నాగ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నన్ను ట్రిగర్ చేస్తే.. దేత్తడి పోచమ్మ గుడే.. ఇచ్చి పడేస్తా’’ అంటూ సంకేతాలు పంపింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లింది.
చక్కని ఏవీతో అడుగుపెట్టింది కాజల్. కట్టుబాట్ల పరదాను దాటి.. మతాంతర వివాహంతో తన జీవితం గురించి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేజ్ మీద గల గల మాట్లాడేస్తూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగార్జునతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోవాలనే కోరికను తీర్చుకుంది. గాయని జానకి గొంతుతో ‘‘నరుడు ఓ నరుడా’’ పాట పడింది. అనంతరం హౌస్‌లో అడుగు పెట్టింది.
హౌస్‌లోకి 16వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు మానస్ అడుగుపెట్టాడు. ఆరు అడుగుల బుల్లెట్ పాటతో స్టైలిష్‌గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు.
హౌస్‌లో 15వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ఉమాదేవి స్టేజ్ మీదకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఏవీని ప్రదర్శించారు. ‘‘సమాజం ఏమనుకుంటుదనే విషయాన్ని పక్కన పెట్టి నేను నటించాను. 18 ఏళ్లకే ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తర్వాత విడిపోయాం. ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశాం. నా పిల్లలే నా ప్రపంచం. వారి కోసమే నేను బతుకుతున్నా’’ అని తెలిపింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లింది.
బిగ్‌బాస్‌లో 14వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు విశ్వ అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతడి ఏవీని ప్రదర్శించారు. చీకటిని వెనక్కి నెట్టి వెలుగులోకి వస్తున్నాడు మీ విశ్వా.. అంటూ హీరో స్టైల్‌లో వచ్చాడు. కేజీఎఫ్ టైటిల్ సాంగ్‌తో బైకు మీద స్టేజ్ మీదకు వచ్చాడు.
యూట్యూబ్‌లోని ‘7 ఆర్ట్స్’ చానెల్ ద్వారా గుర్తింపు పొందిన సరయు 13వ కంటెస్టెంట్‌గా స్టేజ్ మీదకు అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఓ బోల్డ్ ఏవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాను దమ్ దమ్ చేస్తానంటూ తనదైన శైలిలో నాగ్ చెప్పింది. ‘మింగేయ్’ అంటూ తన బూతు పురాణం ఎత్తింది. చిన్నప్పుడు తన తల్లి ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లింది. బ్రెజీలియన్ లవ్ సాంగ్ అనే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో చూపించింది. అందులో వెళ్దామంటే సినిమా నటులే వెళ్తారని చెప్పింది. అప్పుడే అమ్మతో అన్నాను ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని అనుకున్నాను. ఈ రోజు మీ ముందు నిలుచున్నా’’ అని సరయు తెలిపింది. ఈ సందర్భంగా నాగ్.. ‘‘నువ్వు కోరుకున్నట్లే.. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నావ్. అన్నపూర్ణగారి అబ్బాయి ముందు ఉన్నావు’’ అని చెప్పి ఆమెను హౌస్‌లోకి పంపారు.
12వ కంటెస్టెంట్‌గా నటరాజ్: కొరియోగ్రాఫర్ నటరాజ్ 11వ కంటెస్టెంట్‌గా స్టేజ్ మీద అడుగు పెట్టారు. ముందుగా ఆయన ఏవీని ప్రదర్శించారు. ‘పుష్ప’లోని ‘‘పులొచ్చి కొరుద్ది పీక’’ పాటతో నటరాజ్ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు.
11వ కంటెస్టెంట్‌గా సినీ నటి హమీదా హౌస్‌లోకి వచ్చింది. ‘‘రంభ.. ఊర్వసి.. మేనక..’’ పాటకు హాట్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగ్ ఆమెకు కొందరి హౌస్ మేట్స్ కళ్లు చూపించారు. అందులో మీకు ఏ కళ్లు నచ్చాయో చెప్పాలని అడిగారు. దీంతో ఆమె ‘డి’ని ఎంపిక చేసింది. దీంతో నాగ్.. హౌస్‌లో ఉన్న ఒకరికి మీరు నచ్చిన కళ్లు ఉంటాయని చెప్పారు.
ఐదుగురు తర్వాత వచ్చిన మిగతా ఐదుగురు కంటెస్టెంట్‌ల కోసం ‘పకడో పకడో’ అనే మరో టాస్క్ నిర్వహించారు. ఇది కూడా సింగిల్ బెడ్ కోసమే. జంతువుల శబ్దాలను విని.. హౌస్‌లో ఆ జంతువును వెతికి పట్టుకోవాలి. ఎవరి వద్ద జంతువుల బొమ్మలు ఉంటాయో వారు విజేతలని బిగ్ బాస్ తెలిపాడు.
యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్ంత్ 10వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లాడు. ‘హూ ఆర్ యూ’ పాటకు దుమ్ములేపాడు. షన్ముఖ్ ఎంటర్ కాగానే ‘అరే ఎంట్రా ఇది’ అని నాగ్ పలకరించడం విశేషం.
9వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ సాయితేజ (ఇప్పుడు ప్రియాంక సింగ్) అడుగు పెట్టింది. ఒకప్పుడు అబ్బాయిగా ఉన్న సాయి తేజ.. కొన్నాళ్ల కిందట లింగ మార్పిడితో అమ్మాయిగా మారాడు. ఈ సందర్భంగా స్పెషల్ ఏవీని స్టేజ్ మీద ప్రదర్శించారు. ఇందులో ప్రియాంక తన జీవితాన్ని కవితాత్మకంగా వినిపించింది. మదిని ఒప్పించని మార్గంలో మగువగా మారి ముందుకు సాగానంటూ.. తన గురించి రెండు ముక్కల్లో చెప్పేసింది. ‘‘మా నాన్నగారికి నేను లింగ మార్పిడి చేసుకున్నానని తెలీదు. మా నాన్నగారు కాలేజ్‌లో ల్యాబ్ అటెండర్‌గా పనిచేసేవారు. చిన్న ప్రమాదంలో ఆయన చూపుకోల్పాయారు. నాకు సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదనే ఉద్దేశంతో.. లైంగిక మార్పిడి చేసుకున్నాను. మీరు తలదించుకొనే పని ఎప్పుడూ చేయను’’ అని ప్రియాంక ఈ సందర్భంగా తెలిపింది. నాగ్ కూడా ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపారు.
8వ కంటెస్టెంట్‌గా సూపర్ మోడల్ జెస్సీ ఎంటర్ అయ్యాడు. 36 గంటలు కంటిన్యూగా నాన్ స్టాప్ ర్యాంప్ వాక్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారని నాగ్ ఈ సందర్భంగా తెలిపారు.
7వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చక్కని ఏవీతో ఆకట్టుకున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆమె ఆ వీడియోలో వివరించారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురి గురించి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నన్ను నేను తెలుసుకొనే ప్రయత్నం కోసమే బిగ్‌బాస్‌లోకి వచ్చాను’’ అని తెలిపింది. అనంతరం ప్రియా కొడుకు విషెస్‌ను స్టేజ్ మీద చూపించారు.
6వ కంటెస్టెంట్‌గా లోబో ఎంట్రీ ఇచ్చాడు. తాను కార్టూన్ ఆర్టిస్టునని, తన తొలి టాటూ రష్యా అమ్మాయి వేశానని.. ఆమే తనకు లోబో అని పేరు పెట్టిందని తెలిపాడు. తాను 9వ తరగతి వరకు మాత్రమే చదివానని లోబో తెలిపాడు. నా పెళ్లయ్యి, కూతురు పుట్టిన తర్వాత నేను మారానని తెలిపాడు. ‘‘నా తండ్రి బతికి ఉండగా.. ఆయనకు విలువ ఇవ్వలేకపోయా. అందుకే రోజూ ఆయన సమాధి వద్దకు వెళ్తుంటా’’ అని లోబో భావోద్వేగానికి గురయ్యాడు.
‘దండేసి దన్నం పెట్టు’ టాస్క్ ఇచ్చారు. సింగిల్ బెడ్ అన్‌లాక్ చేయడం కోసం ఈ టాస్క్ ఇచ్చారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల చేతికి ఒక దండ ఇచ్చారు. అది ఎవరి వద్ద ఉండిపోతుందో వారు ఓడిపోయినట్లు. ముందుగా దండ లహరీ చేతికి ఇచ్చారు. అది ఆమె ఎవరి వేయకపోవడంతో ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత సన్నీ ఆ దండ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ ఓడిపోవడంతో సిరి.. ఆ దండను మరొకరికి వేసేందుకు పరిగెట్టింది. చివరికి సన్నీ సింగిల్ బెడ్‌ను సాధించేందుకు మొదటి పోటీ దారుడిగా ఎన్నికయ్యాడు. దీంతో సన్నీ ఆ మాలను ధరించాడు.
ఐదవ కంటెస్టెంట్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఏవీని ప్రదర్శించారు. తాను హైదరాబాద్ అమ్మాయినే అంటూ.. తన గురించి వివరించింది. బిగ్‌బాస్‌కు వెళ్తే.. తన అబ్బాయిని చాలా మిస్ అవుతానని తెలిపారు. ఈ సారి బిగ్‌బాస్‌ను అమ్మాయిలే గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నానని యానీ మాస్టర్ తెలిపారు.
నాలుగో కంటెస్టెంట్‌గా గాయకుడు శ్రీరామ చంద్ర ఎంటర్ అయ్యాడు. మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ అవుతున్నానని శ్రీరామ్ తెలిపాడు. తాను ఇండియన్ ఐడల్ తర్వాత 500 పైగా సాంగ్స్ పాడానని తెలిపాడు. తనకు తెలుగులో పాటలు పాడాలని ఉందని, బిగ్ బాస్ ద్వారా తన పాటలను వినిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని కోరుకుంటున్నానని శ్రీరామ చంద్ర పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగార్జున కోసం ‘‘ఆమని పాడవే హాయిగా.. ’’ పాట పాడి వినిపించాడు శ్రీరామ చంద్ర.
మూడో కంటెస్టెంట్‌గా లహరి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి హాట్‌గా ఎంట్రీ ఇచ్చింది. లహరి హౌస్‌లోకి వెళ్లగానే సన్నీ పులిహోర కలపడం మొదలుపెట్టాడు. నాగ్ వద్ద గీసిన డ్రీమ్ కలర్ బొమ్మతో లహరీని కంపేర్ చేసుకున్నారు. నేను స్మాల్ స్క్రీన్ మన్మథుడిని చెప్పుకున్నాడు. లహరీకి నాగ్ ఇచ్చిన రోజా పువ్వును తనకు ఇవ్వమనగా.. అది కేవలం తనకు నచ్చినవారికే నాగ్ ఇవ్వమన్నారని లహరీ తెలిపింది.
బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి, యూట్యూబర్ సిరి హన్మంత్ తొలి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ‘భూమ్ బద్దల్’ సాంగ్‌తో సిరి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఓ డైలాగ్‌ను నాగ్.. ఐదు రసాల్లో పలికించాలని కోరగా.. ఆమె చెసి చూపించింది. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే ఈ హౌస్‌లోకి వచ్చానని, ప్రేక్షకులకు కావల్సిన వినోదం ఇవ్వడానికి రెడీగా ఉన్నానని సిరీ ఈ సందర్భంగా తెలిపింది. అనంతరం నాగ్ ఆమెను హౌస్‌లోకి వదిలిపెట్టారు. దీంతో హౌస్ చూసి.. తన ఊతపదం ‘ఓడియమ్మ’ అనేసింది. సిరీ తర్వాత రెండవ కంటెస్టెంట్‌గా.. వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు.
నాగార్జున కాసేపు ఇంట్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లోకి చేర్చిన మోజో రూమ్, పవర్ రూమ్స్‌ను చూపించారు. ఈ సారి బిగ్‌బాస్‌లో డైనింగ్ టేబుల్స్ కూడా విడదీయడంతో ‘డివైడ్ అండ్ రూల్’ చేయబోతున్నట్లు నాగ్ సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. బిగ్ బాస్ హౌస్‌లో రెండు గదులు లాక్ చేసి కూడా ఉంచారు. ఇది కూడా గేమ్‌లో ప్లానేనని నాగ్ అన్నారు. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నాగ్ ఈ విషయాన్నే బిగ్ బాస్‌ను అడిగితే.. సమయం వచ్చినప్పుడు తెలుస్తుందనే సమాధానం వచ్చింది.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్-5’ ఆదివారం నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు నాగ్ గ్రాండ్ ఎంట్రీతో ఈ రియాలిటీ షో మొదలైంది. ముందుగా నాగార్జున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘మిస్టర్ మజ్నూ’ పాటతో నాగ్ స్టైలిష్‌గా డ్యాన్స్ చేస్తూ.. షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ అక్కినేనికి ఆహ్వానం పలికారు. ‘ఒక లైలా కోసం’ పాటకు నాగ్ స్టెప్‌లు వేశారు నాగార్జున. అనంతరం బిగ్ బాస్ హౌస్‌లోకి నాగ్ ఎంట్రీ ఇచ్చారు.
యాంకర్ రవి - టీవీ యాంకర్
షణ్ముఖ జస్వంత్ - యూట్యూబ్ స్టార్
యానీ మాస్టర్ - కొరియోగ్రాఫర్
నటరాజ్ మాస్టార్ - కొరియోగ్రాఫర్
శ్వేతా వర్మ - సినిమా నటి
ప్రియ - సీరియల్, సినీ నటి
లహరి - సీరియల్ నటి
మానస్ - సీరియల్ నటుడు
సరయు - యూట్యూబ్ స్టార్ (7 ఆర్ట్స్)
కాజల్ - ఆర్జే
విశ్వ - సీరియల్ నటుడు
శ్రీరామ చంద్ర - గాయకుడు
సన్నీ - వీజే
ఉమా దేవి - సీరియల్ నటి
సిరి హన్మంత్ - సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్
సాయి తేజ (ప్రియాంక) - జబర్దస్త్ కమెడియన్
లొబో - యాంకర్
ఫరిదా - సింగర్
Background
బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సందడి మొదలైపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రోమో విడుదలైన గంటలోనే మూడు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ఒక్కో కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. వారి కంటే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హౌస్ లోపల కంటెస్టెంట్స్ ఉండే గదులు, కన్ఫెషన్ రూమ్, కిచెన్, ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, జైల్‌ను నాగ్ చూపిస్తారు. ఆ తర్వాత సీరియల్ నటి, యూట్యూబ్ స్టార్ సిరితో ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చివర్లో యాంకర్ రవి డ్యాన్స్‌తో ముగుస్తుందని సమాచారం. అలాగే.. ఈ రోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల జాబితా కూడా ఆన్‌లైన్ లీకైంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -