బాలీవుడ్ హీరోయిన్ అయేషా టాకియాకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ అధికారి ఆమెని అసభ్యంగా తాకాడని ఆమె భర్త ఫర్హన్‌ అజ్మీ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని బాధపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన ఫ్యామిలీతో కలిసి ఇండిగో 6E 6386 విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేప్పుడు  ఎయిర్‌పోర్టులో ఆర్‌పీ‌సింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు తనను, తన కుటుంబాన్ని అడ్డగించారని చెప్పారు. 


తన పేరుని గట్టిగా పలుకుతూ.. టీమ్ మెంబర్స్ తో కలిసి వెకిలిగా ప్రవర్తించారని.. సెక్యూరిటీ చెక్ కోసం లైన్ లో నిలబడితే డెస్క్ లో ఉన్న ఓ అధికారి తనను, తన ఫ్యామిలీను వేరువేరు లైన్ లో నిలబడమని చెప్పి.. అయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలను టచ్ చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించగా.. చెత్తగా సెక్యువల్ కామెంట్స్ చేస్తూ మాట్లాడారని చెప్పారు. 


ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఫర్హన్ అజ్మీ. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అంటూ వెల్లడించారు. అయేషా టాకియా తెలుగులో 'సూపర్' సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. పెళ్లి తరువాత సినిమాలను పక్కన పెట్టేసింది. 


Also Read: తల్లి కాబోతున్న బాపు బొమ్మ, భర్త బర్త్ డేకు స్పెషల్ న్యూస్


Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?