Pranitha Subhash announced her first pregnancy: కథానాయిక ప్రణీతా సుభాష్ ఉన్నారు కదా! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'లో రెండో నాయికగా నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'రభస', సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లోనూ నటించారు. పెళ్లి తర్వాత సినిమాలు ఏవీ చేయలేదు. ఇప్పుడు మరో ఏడాది వరకు చేయడానికి వీలు పడదేమో! ఎందుకంటే... ప్రణీతా సుభాష్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఇప్పుడు ఆమె గర్భవతి. నేడు భర్త పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ న్యూస్ షేర్ చేశారు.


నితిన్ రాజుతో గత ఏడాది లాక్‌డౌన్‌లో ప్రణీతా సుభాష్ వివాహం జరిగింది. మే 31న కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో విషయం బయటకు చెప్పారు. ఈ రోజు నితిన్ రాజు పుట్టినరోజు. "మా ఆయన 34వ పుట్టినరోజు సందర్భంగా పైనున్న దేవతలు మాకు ఓ బహుమతి పంపించారు" అంటూ తాను గర్భవతి అన్న విషయాన్ని ప్రణీతా సుభాష్ వెల్లడించారు. అదీ సంగతి!


Also Read: ప్రభాస్ అభిమానులు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది



హిందీ సినిమా ఇండస్ట్రీకి గత ఏడాది 'హంగామా 2' సినిమాతో ప్రణీతా సుభాష్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత అజయ్ దేవగణ్ 'భుజ్' సినిమా చేశారు. ప్రస్తుతం కన్నడ సినిమా 'రమణ అవతార' ఒక్కటి షూటింగ్ లో ఉంది.


Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?