యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాలు చేసే దర్శకులు, నిర్మాతలు ఓ విషయం మనసులో పెట్టుకోవాలి... ఒక్కోసారి అకారణంగా అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని! అభిమానులు అభీష్టానికి తగ్గట్టు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి విడుదల కాకపోతే సోషల్ మీడియాలో దర్శక నిర్మాతలను ఆడుకోవడం ప్రభాస్ అభిమానులకు మామూలే! 'రాధే శ్యామ్' విషయంలో యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ అభిమానుల ఆగ్రహాన్ని కనివిని ఎరుగని రీతిలో చవి చూసింది. ఇప్పుడు ఆ హీట్ ఎలా ఉంటుందో? 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ చూస్తున్నారు.


శ్రీరామ నవమి రోజున 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆ సినిమాలో ప్రభు రామ్ (శ్రీరామ చంద్ర ప్రభువు) పాత్రలో ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అదీ కాకుండా రామాయణం ఆధారంగా రూపొందుతోన్న సినిమా. దాంతో తప్పకుండా 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ ఆదివారం విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు. శ్రీరాముడి లుక్ విడుదల చేయడానికి శ్రీరామ నవమి కంటే మంచి సందర్భం ఏముంటుందని అనుకున్నారు. అయితే... 'ఆదిపురుష్' దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పలేదు. చేయలేదు కూడా! దాంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అసలే నిరాశలో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్లను దర్శకుడు ఓం రౌత్ షేర్ చేయడం ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆయనను తిట్టడం మొదలుపెట్టారు.


'పండగ రోజు బూతులు తిట్టించకు బ్రో' అని ఒకరు కామెంట్ చేస్తే... 'నిదానంగా నువ్వు యువి క్రియేషన్స్ అడ్మిన్ టైప్ తయారయ్యావ్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'అవన్నీ మేం ఎప్పుడో చూశాం రా అయ్యా' అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి బంగారు అవకాశం ఇది. మిస్ చేసుకున్నావ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'చాలా మంది 'శ్రీరామ నవమికి ఫస్ట్ లుక్ విడుదల చేశారని ఆశించాం. చాలా డిజప్పాయింట్ అయ్యాం' అని పేర్కొన్నారు. 'అలెక్సా... ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ప్లే చెయ్' అని ఒకరు, 'పొద్దు పొద్దున్నే పెద్ద బాణం వదిలావ్ మావా బ్రో' అని ఇంకొకరు దర్శకుడిని ఒక ఆట ఆదుకున్నారు. బహుశా... ఓం రౌత్ ఇటువంటి రియాక్షన్స్ చూడటం ఫస్ట్ టైమ్ ఏమో!?


Also Read: 20 ఏళ్లుగా ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని- ప్రశాంత్ నీల్ కామెంట్స్


ఫస్ట్ లుక్ విడుదల చేయకపోయినా... 'ఆదిపురుష్' విడుదల తేదీని మరోసారి దర్శకుడు ఓం రౌత్ కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. 


Also Read: డబుల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ట్విస్ట్ - ఎలిమినేట్ అయిందెవరంటే?