టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన తదుపరి సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో చేయబోతున్నారు. వీటితో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు రావడంతో టాలీవుడ్ హీరోలు ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


ఇప్పటికే ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్.. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. అక్టోబర్ 2022లో సినిమా స్టార్ట్ అవుతుందని.. 'కేజీఎఫ్' రేంజ్‌లో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ నటించనున్న 31వ సినిమా ఇది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


తాజాగా ఈ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో కలిసి జర్నీ చేయడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుందని.. రెండేళ్లుగా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని.. తనకు స్టోరీ బాగా నచ్చిందని.. ప్రస్తుతం దానిపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు పది, పదిహేను సార్లు ఎన్టీఆర్ ని కలిశానని.. అతడిని అర్ధం చేసుకోవాలనుకుంటున్నాని చెప్పారు. తన సినిమాలకు సంబంధించి ఇలా ముందుగా హీరోలతో ట్రావెల్ చేస్తుంటానని అన్నారు. 


ఈ సినిమా జోనర్ ఏంటనేది చెప్పడానికి నిరాకరించారు ప్రశాంత్ నీల్. 'సలార్' సినిమా రిలీజ్ సమయంలో చెబుతానని అన్నారు. అలానే ఎన్టీఆర్ కి తను అభిమానినని.. 20 ఏళ్లుగా అతడికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. అతడితో సినిమా చేసే ఛాన్స్ రావడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. 


Also Read: ఆ బూతులేంటి? నటరాజ్ మాస్టర్ పై నాగార్జున ఫైర్


Also Read: రవితేజ కోసం సిద్ శ్రీరామ్ మ్యాజికల్ సాంగ్