బిగ్ బాస్ సీజన్ ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరోవారంలోకి ఎంటర్ అవుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లనున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. ముందుగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తూ.. మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో చెప్పండని అడిగారు. అందులో ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెప్పారు. 

 

ఆ తరువాత నటరాజ్‌ మాస్టర్‌-యాంకర్ శివల గొడవ తేల్చే ప్రయత్నం చేశారు నాగార్జున. శివను ఉద్దేశిస్తూ.. లుంగీ ఎత్తి చూపించడం కరెక్ట్‌ అనుకుంటున్నావా? అని నాగార్జున ప్రశ్నించారు. సరదాగా చేశానని శివ చెప్పగా.. బిగ్‌బాస్‌ వీడియో ప్లీజ్‌ అంటూ శివ ఏం చేశాడో చూపించారు. అలానే నటరాజ్ మాస్టర్ బూతులు మాట్లాడడాన్ని నాగార్జున ఎత్తిచూపారు. 23 ఏళ్ల అనుభవం ఉంది.. ఆ పదాలేంటి..? అని ప్రశ్నించారు నాగార్జున. లుంగీ ఎత్తడం తప్పు అని నాగార్జున.. శివను హెచ్చరిస్తుండగా.. నటరాజ్ మాస్టర్ మధ్యలో కలగజేసుకోవడంతో నాగార్జునకు కోపమొచ్చింది. 'నటరాజ్ మాస్టర్ సైలెంట్.. నేను అతడితో మాట్లాడుతున్నాను' అంటూ గట్టిగా అరిచారు.

 

ఆ తరువాత హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ.. నామినేషన్ లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చారు నాగార్జున. ముందుగా అజయ్, అషురెడ్డిలను సేవ్ చేశారు. ఆ తరువాత మహేష్ విట్టా, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్, బిందు మాధవిలను సేవ్ చేశారు.  ఫైనల్ గా మిత్రా, ముమైత్, స్రవంతిలు మిగిలి ఉన్నారు. వారి ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు చెప్పారు నాగార్జున. కాసేపటి తరువాత మిత్రాను సేవ్ చేసి.. ముమైత్ ఖాన్, స్రవంతిలను ఎలిమినేట్ చేశారు. 

 

ముమైత్ హ్యాపీగానే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. స్రవంతి మాత్రం ఏడ్చేసింది. అఖిల్, అజయ్ లను హత్తుకొని ఎమోషనల్ అయింది. బిందు మాధవి అయితే స్రవంతిని హగ్ చేసుకొని ఏడ్చేసింది.